Motkupalli Narsimhulu praises CM KCR and Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. ఒక దళిత కుటుంబానికి రూ 10 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ లాంటి మొనగాడు దేశంలోనే లేడని మోత్కుపల్లి నర్సింహులు కితాబిచ్చారు. దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి లక్షల కోట్లు ఖర్చు పెడుతా అంటే ప్రతిపక్షాలకు ఎందుకు అంత బాధ అవుతుందో అర్థం కావడం లేదని అన్నారు. కేసీఆర్ (CM KCR) ఇస్తామన్నంత డబ్బు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇస్తయా అని ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దళిత బంధు పథకం అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన మోత్కుపల్లి నర్సింహులు.. కేసీఆర్ ఇచ్చే 10 లక్షలతో దళితులు బాగుపడితే ఇక వాళ్లు బానిసలుగా ఉండరని కొంతమంది భావిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే దళిత బంధు పథకాన్ని అఖిలపక్షం నేతలు స్వాగతించాల్సిన అవసరం ఉంది. అందుకే దళిత బంధు పథకంను (Dalita Bandhu scheme) వ్యతిరేకిస్తున్న వారి మనసు మార్చాలని ఆ యాదాద్రి లక్ష్మీ నర్శింహా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తానని తెలిపారు.


Also read : RS Praveen Kumar to join BSP: బీఎస్పీలో చేరనున్న ప్రవీణ్ కుమార్ 


Huzurabad bypolls లో టీఆర్ఎస్‌కే దళితుల సంపూర్ణ మద్దతు:
హుజూరాబాద్ ఉపఎన్నికలో దళితులు టీఆర్ఎస్‌ పార్టీకే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) పిలుపునిచ్చారు. పదవిని అడ్డం పెట్టుకుని 700 ఎకరాల భూమి సంపాదించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ఒక పెద్ద అవినీతిపరుడని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితులు ఈటల రాజేందర్‌ను (Etala Rajender) ఓడించాలని మోత్కుపల్లి నర్సింహులు దళితులకు విజ్ఞప్తి చేశారు.


Also read : Etela Rajender: చిన్నోళ్లమా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గుద్దుడు గుద్దుతరు: KCR కి ఈటల కౌంటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook