Motkupalli ‍‍‍Narasimhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకునే విషయంలో తనకు ఒక మాట కూడా చెప్పలేదన్న మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్ లాంటి అవినీతిపరుడిని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తంచేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) ఈటల రాజేందర్‌కు పోటీచేసే అర్హత లేదన్న మోత్కుపల్లి నర్సింహులు... అక్కడి ప్రజలు ఆయన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Heavy rains in Telangana: వరద నీటిలో నిర్మల్.. ఇళ్లలోకి భారీగా వరద నీరు


దళితుల భూములు లాక్కుని, దేవాలయ భూములు కబ్జా చేసిన ఈటల రాజేందర్‌కు (Motkupalli Narsimhulu comments on Etela Rajender) ఆ భూములు ఎవరి వద్దనైతే తీసుకున్నారో వారికే తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరానని.. అయినా ఈటల పట్టించుకోలేదని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ ఒకప్పుడు గోచి గుడ్డ కూడా లేని స్థాయి నుంచి 700 ఎకరాలు భూమి, వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించగలిగారో చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) డిమాండ్ చేశారు. 


Also read: India Corona Udpate: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ ఉధృతి


హుజూరాబాద్ ఉప ఎన్నికల (Huzurabad by-election) ముందు చోటుచేసుకున్న ఈ రాజకీయ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనియాంశమైంది. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆగ్రహంతోనే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులు అయ్యారనే టాక్ వినిపిస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook