Heavy rains in Nirmal: నిర్మల్: తెలంగాణలో ఇటీవల గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరద ముంచెత్తుతోంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో వర్షాలు, వరదలు పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. నిర్మల్‌తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నీట మునిగిన ఊర్లు, కాలనీలే కనిపిస్తున్నాయి. అనేక గ్రామాలు నీట మునగడంతో ఆయా గ్రామాల జనం ఇళ్లలోకి వచ్చిన వరద నీటి (Floods in Nirmal) మధ్యే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
#WATCH | Telangana: National Disaster Response Force (NDRF) teams rescue 7 people who were stranded in an old age home due to flash floods in Savel village of Nizamabad district. pic.twitter.com/uJjEfS861I
— ANI (@ANI) July 23, 2021
Also read : Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకు తప్పని వర్షాలు
భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక చోట్ల రహదారి వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గోదావరి నది (Godavari river) పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం మరీ అధికంగా కనిపిస్తోంది. గురువారమే నిర్మల్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (NDRF teams) వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ఒక్క నిర్మల్ జిల్లాలోనే వెయ్యికిపైగా మందిని వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం.
#WATCH | Telangana: Siricilla District Collectorate premises inundated, following incessant rainfall in the region.
India Meteorological Dept has issued a Red alert in three districts - Kumuram Bheem, Jagtial, Warangal, and Orange alert in 9 districts of the state. pic.twitter.com/Ylq7T5kHBN
— ANI (@ANI) July 23, 2021
Also read : Heavy rains: రాగల మూడు రోజులు వర్షాలు.. రేపు భారీ వర్షాలు
ఇదిలావుంటే నిర్మల్‌లో వరద నీటిలో (Nirmal floods) చేపలు కొట్టుకొస్తుండటంతో కొంతమంది రోడ్లపైనే చేపలు పడుతూ కనిపించారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాల్సిందిగా సీఎం కేసీఆర్ (Telangana CM KCR) అధికారులను ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook