Asaduddin Owaisi on CM KCR: కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేయకండని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కేసీఆర్‌ రాజకీయ చతురిత అంతా.. ఇంతా కాదన్నారు. కేసీఆర్‌ రాజకీయ చాణక్యుడు అని అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గాయన్నారు. దేశంలో కూడా తెలంగాణలాంటి విజన్‌ కావాలని.. దేశంలో మూడో ఫ్రంట్‌ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమకు బలం ఉన్న చోట తాము తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా మసీద్‌ కూల్చితే మళ్లీ కట్టారా..? అని ప్రశ్నించిన ఓవైసీ.. మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తోందన్నారు. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో మైనార్టీ పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారని పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అరవింద్‌పై అసదుద్దీన్‌ సెటైర్లు వేశారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీ వెళ్తుందన్న అరవింద్‌పై కామెంట్స్‌ స్పందించిన ఆయన.. అరవింద్‌ చాలా పెద్ద సైంటిస్ట్‌ అయి ఉంటారని అన్నారు. ద కశ్మీర్‌ ఫైల్స్‌కు అవార్డ్‌ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ముస్లింలను తిట్టమే పనిగా ద కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా తీశారని.. సినిమాలను ప్రమోట్ చేయటం ప్రధాని పనా..? అని నిలదీశారు. దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టిన సినిమాకు జాతీయ సమైక్యత అవార్డ్‌ ఇవ్వటం అర్థం లేదన్నారు.


"ఎన్‌డీఏకు INDIA ప్రత్యామ్నాయం కాదుజ కాంగ్రెస్‌, బీజేపీ లేని మూడో ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో UPA ప్రభుత్వం జగన్‌ను జైల్లో పెట్టారు. INDIAలో పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీలు లేవు.." అని అసదుద్దీన్ అన్నారు.


చివర్లో మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. తనను ప్రశ్నించేటప్పుడు హోంవర్క్‌ చేసుకుని రావాలని సూచించారు. సీడబ్ల్యూఏ బిల్లుకు కేసీఆర్‌ మద్దతు తెలిపలేదని.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా  అసెంబ్లీలో తీర్మానం చేశారని అన్నారు. ఎవరిని ప్రశ్నిస్తున్నావో తెలుసుకుని మాట్లాడు అంటూ ఓ మీడియా ప్రతినిధిని అన్నారు. "నేను చెవిలో పూలు పెట్టుకుని మీ ముందు కూర్చోలేదు. మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం. తెలంగాణ రాష్ట్రం వద్దని ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ కూడా లేఖ రాశాం. మా లక్ష్యం వేరు - కేసీఆర్‌ లక్ష్యం వేరు. మరోసారి కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నా.. మజ్లీస్‌ పార్టీ కూడా వారికి మద్దతిస్తోంది.." అని ఓవైసీ అన్నారు.


Also Read: PM Modi Letter About Gaddar: మీ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేం.. గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ  


Also Read: Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook