Mp Bandi Sanjay: భారీ మెజారిటీతో గెలవబోతున్నాం: ఎంపీ బండి సంజయ్
Mp Bandi Sanjay: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ మెజారిటీ స్థానాలు గెలవబోతున్నట్లు చెప్పారు.
Mp Bandi Sanjay: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ అన్ని అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీతో గెలవబోతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అడ్డంకులు సృష్టించినా తట్టుకుని కాషాయ జెండా పట్టుకుని తెగించి కొట్లాడిన కార్యకర్తలే నిజమైన హీరోలని అభివర్ణించారు.
కరీంనగర్‌లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి అందరికీ స్పూర్తిగా నిలిచేలా చేస్తామన్నారు. పేదల ఇండ్లను కబ్జా చేసేటోళ్లను, భూకబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళని చూస్తే పక్కా గెలుస్తామనే నమ్మకం ఏర్పడిందని, కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో భారీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు నా హీరోలన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధీటుగా ఎదుర్కొంటూ తన వెంట ఉన్న ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా సహకరించిన మంద క్రిష్ణ మాదిగతోపాటు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలందరికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. బీజేపీట్ల విశ్వాసం, నరేంద్రమోదీ పట్ల నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఎగ్జిట్ పోల్స్ పై మీడియా అడిగిన ప్రశ్నకు ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ, ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరి అభిప్రాయాలు వారివని, గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సీట్లు వస్తాయనే నమ్మకం మాకుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 3న వాస్తవ ఫలితాలు వచ్చాక, ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జాతీయ నాయకత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీజేపీ ఇచ్చిన మాటకు ఎప్పుడు కట్టుబడి ఉందని ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. పేదల ఇండ్లను కబ్జా చేసేటోళ్లను, దౌర్జన్యం చేసేవాళ్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి