DK Aruna: రేవంత్ రెడ్డి అడ్డాలో గద్వాల జేజమ్మ గర్జన.. ఈగ వాలినా ఊరుకోను
MP DK Aruna Warns To Revanth Reddy: ముఖ్యమంత్రి సొంత నియోజవర్గంలో పాలమూరు ఎంపీ డీకే అరుణ గర్జించారు. తన పార్టీ.. అనుచరులపై ఈగ వాలినా ఊరుకోనని రేవంత్ రెడ్డికి హెచ్చరించారు.
DK Aruna Kodangal Visit: పాలనలో వైఫల్యం.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరాచకాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ఎంపీ డీకే అరుణ కూడా స్పందించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే ఆమె గర్జించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తన అనుచరులపై జరుగుతున్న వేధింపులు, కక్షసాధింపు చర్యలపై మండిపడ్డారు. తన వారిపై ఈగ వాలినా కూడా ఊరుకోనని హెచ్చరించారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో తాను ఉన్నానని కార్యకర్తలు, అనుచరులకు అరుణ భరోసా ఇచ్చారు.
Also Read: BRS Party Dharna: రుణమాఫీపై రేవంత్ విఫలం.. ఎల్లుండి ధర్నాలతో దద్దరిల్లనున్న తెలంగాణ
కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్‌పేటలో మంగళవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. 'ఎన్ని కష్టాలు పెట్టినా.. భయపెట్టినా గొప్పగా పని చేసి నా గెలుపునకు కృషి చేశారు. నా గెలుపులో భాగస్వాములైన మీ అందరికి ఏ కష్టం వచ్చినా మీకూ నేనున్నా' అంటూ కార్యకర్తలకు అండగా నిలిచారు. మీ పై ఈగ వాలినా ఊరుకోనని స్పష్టం చేశారు. ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే వాలిపోతానని ప్రకటించారు.
Also Read: Weather Report: తెలంగాణకు హై అలర్ట్.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచన
కార్యకర్తలను రేవంత్ రెడ్డి అండదండలతో వేధిస్తే ఊరుకోనని డీకే అరుణ హెచ్చరించారు. తనను గెలిపించిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని తెలిపారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇకపై నా పార్లమెంట్‌లో ఇలాంటి బెదిరింపు రాజకీయాలు సాగనివ్వను. బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోను' అని స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులపై కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు. ఏ ఒక్క ఇబ్బంది అయినా తనకే ఫోన్ చేయాలని.. తాను చూసుకుంటానని చెప్పారు.
కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలిగా గెలిచిన అనంతరం తొలిసారి బొంరాస్‌పేటలో అరుణ పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల్లో అరుణకు ఇక్కడ మంచి మెజార్టీ లభించింది. దీంతో ప్రత్యేకంగా బొంరాస్‌పేటలో అరుణ పర్యటించి తన గెలుపు కోసం కష్టపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో అందరినీ బెదిరింపులకు పాల్పడుతుండడంతో అరుణ ఇక్కడి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలోనే బొంరాస్‌పేటలో పర్యటించారు. భవిష్యత్‌లో కూడా తరచూ ఇక్కడ పర్యటించాలని అరుణ నిర్ణయించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter