Munugode Results: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన మునుగోడు ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇక్కడ విజయం సాధించి.. అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెక్ పెట్టాలని భావించిన బీజేపీకి మునుగోడు ప్రజలు షాకిచ్చారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కమల తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. చివరి వరకు పోరాడి ఓటమి పాలయ్యారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని.. కేసీఆర్ పతనానికి మునుగోడే నాంది కావాలని ఆయన ప్రచారంలో పిలుపునిచ్చారు. ఇక తనకు ఎదురులేదని భావించిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఓటర్లు ఊహించని ఝలక్ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజగోపాల్ రెడ్డి ఓటమికి గల కారణాలను రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి 22 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయారనే అంశాన్ని జనాల్లోకి గులాబీ దండు బలంగా తీసుకెళ్లింది. ఈ విషయంపై ఓ ఛానెల్‌లో ఆయన నోరు జారడం ఓటమికి బీజం పడింది. టీఆర్ఎస్ నేతలు పదేపదే ఈ విషయంపై నిలదీస్తూ.. ప్రజలకు స్పష్టంగా వివరించడంలో సక్సెస్ అయ్యారు. 


రాజగోపాల్ రెడ్డి ఓటమికి తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి కూడా ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెంకట్ రెడ్డి నోటి దురుసు మరో మైనస్ పాయింట్ అంటున్నారు. కోమటిరెడ్డి ఆడియో కాల్ లీక్ కావడం ప్రచారం సమయంలో కలకలం రేపింది. పార్టీలకు అతీతయంగా బీజేపీకి ఓటు వేయాలని కోరడం దెబ్బతీసింది. ఈ ఆడియో కాల్ అటు కాంగ్రెస్‌కు ఇటు బీజేపీకి బాగా డ్యామేజ్ చేసింది. 


కాంగ్రెస్ కోటను బద్ధలు కొట్టేందుకు గులాబీ దళం మొత్తం మునుగోడులోనే మకాం వేసింది. గ్రామగ్రామానా తిరుగుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనం కోసమే రాజీనామా చేశారని వివరించారు. బూత్‌లు వారీగా ఇంఛార్జ్‌లుగా ఏర్పడి.. ప్రతి ఓటర్‌కు ప్రభుత్వ పథకాలు వివరించారు. పార్టీ కంటే సొంత చరిష్మానే రాజగోపాల్ రెడ్డి నమ్ముకున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి పెద్ద నాయకులు ప్రచారానికి రాకపోవడం కూడా దెబ్బతీసింది. ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడంలో రాజగోపాల్ రెడ్డి కొంత సక్సెస్ అయినా.. విజయం మాత్రం వరించలేదు. కమ్యూనిస్టులు, ముస్లిం, మైనార్టీలు కూడా గులాబీ పార్టీకి సపోర్ట్ చేయడంతో రాజగోపాల్ రెడ్డి విజయంపై ప్రభావం చూపించింది. పాత బీజేపీ కేడర్‌ను పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. 


కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా రాజగోపాల్ రెడ్డి ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ఆమెకు పోలైన ఓట్లు తక్కువే అయినా.. ఓటమికి కారణమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. తమ పార్టీని మోసం చేసి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు ఆత్మ సంతృప్తి చెందుతున్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లు.. రాజ్ గోపాల్ రెడ్డి ఓటమికి, బీజేపీకి ఎదురుదెబ్బకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ విజయంతో వచ్చే సార్వత్రిక ఎన్నిలకు టీఆర్ఎస్ మరింత సమరోత్సహాంతో రెడీ అవుతుండగా.. లోపాలను సరిదిద్దుకుని బరిలోకి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి.


Also Read: T20 World Cup 2022: టీమ్ ఇండియాను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్, ఇండియా ఇంటికేనా


Also Read: Munugodu Bypoll 2022: మునుగోడులో రౌండ్ రౌండ్‌కు మారిన ఫలితం, రౌండ్ల వారీగా కౌంటింగ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook