T20 World Cup 2022: టీమ్ ఇండియాను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్, ఇండియా ఇంటికెళ్లిపోతుందా

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో ఇక మిగిలింది కీలకమైన సెమీఫైనల్స్ ఘట్టాలే. సెమీఫైనల్ దశను దాటినా..ఫైనల్‌లో సెంటిమెంట్ టీమ్ ఇండియాను వెంటాడుతోంది. అదే జరిగితే ఇండియా ఇంటికేనా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2022, 09:10 PM IST
T20 World Cup 2022: టీమ్ ఇండియాను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్, ఇండియా ఇంటికెళ్లిపోతుందా

టీ20 ప్రపంచకప్ 2022 చరమదశకు చేరుకుంది. ఆరు జట్లు, మూడు మ్యాచ్‌లతో ఫలితం తేలిపోనుంది. టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరే అవకాశాలున్నా..కప్ మాత్రం చేజారిపోనుందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. అసలేం జరిగింది. కారణమేంటి..

టీ20 ప్రపంచకప్ 2022 లో సెమీఫైనల్స్ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య నవంబర్ 9వ తేదీ బుధవారం నాడు సిడ్నీ వేదికగా జరగనుండగా..రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య అడిలైడ్‌లో నవంబర్ 10వ తేదీ గురువారం నాడు జరగనుంది. 

సెమీఫైనల్స్‌లో విజయావకాశాలు ఎవరికి

మొదటి సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ విజయం దాదాపుగా ఖాయమని అంచనా. ఎందుకంటే పాకిస్తాన్ జట్టుకు ఫామ్ లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ అద్భుత ఫామ్ ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ విజయం సాధించాలంటే..బాబర్, రిజ్వాన్‌ల ఫామ్ చాలా ముఖ్యం.

ఇక టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ విషయంలో ఇండియాకే విజయావకాశాలున్నాయి. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఇప్పటికే ఫామ్‌లో ఉంటే..రోహిత్ శర్మ ఫామ్ పుంజుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇంగ్లండ్‌ను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీకాదు.

ఇండియాకు ఫైనల్ గండం

అంటే ఫైనల్స్‌లో ఇండియా, న్యూజిలాండ్ జట్టు తలపడనున్నాయి. ఇదే ఇప్పుడు అభిమానుల ఆందోళనకు కారణమౌతోంది. ఎందుకంటే ఇండియాకు న్యూజిలాండ్ చేతిలో ఫైనల్స్ గండం పొంచి ఉంది. 2007, 2010 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్, 2021 టెస్ట్ ఛాంపియన్ షిప్, 2021 టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ ఇలా అన్నింటిలోనూ టీమ్ ఇండియాను న్యూజిలాండ్ మట్టికరిపించిన దృశ్యాలు గుర్తొస్తున్నాయి. ఇక ఇండియా జట్టులో రోహిత్ శర్మ ఫామ్ లేకపోవడం, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం, స్పిన్నర్లు రాణించకపోవడం మైనస్ పాయింట్లు. అందుకే న్యూజిలాండ్ చేతిలో టీమ్ ఇండియా కప్‌కు దూరమౌతుందనే ఆందోళన అధికమౌతోంది.

Also read: KL Rahul: రెండే రెండు ఇన్నింగ్స్‌లతో.. విమర్శకులకు గట్టిగా ఇచ్చిపడేసిన కేఎల్ రాహుల్! దెబ్బకు అందరూ సైలెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News