Choutuppal RRR Victims: రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) వ్యవహారంలో రైతులను కాంగ్రెస్‌ నిండా ముంచుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాటలు మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్‌ రైతులకు ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ex Minister KTR: హైడ్రాపై కేటీఆర్ సంచలన కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్  


ఆర్‌ఆర్‌ఆర్‌ ఏర్పాటుతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ రెండుగా చీలి రైతులు, భూ యజమానులు తీవ్రంగా నష్టపోతుండడంతో భయాందోళన చెందుతున్నారు. ఉద్యమ బాట పట్టిన రైతులు, బాధితులు మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావును కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని మంత్రికి వివరించారు. కన్నీటిపర్యంతమైన వారికి హరీశ్‌ రావు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Also Read: TTD Temple: దెబ్బకు ప్రధాని మోదీ దిగిరావాలి.. తిరుమల లడ్డూపై హనుమంతరావు తాత దీక్ష


ఈ సందర్భంగా సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 'ఉత్తర దిక్కు ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులకు న్యాయం చేస్తామని భువనగిరి ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం  దౌర్భాగ్యం. ఆర్‌ఆర్‌ఆర్‌ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో చేసిన మార్పుతో చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్య నుంచి రోడ్డు వెళ్లడంతో చౌటుప్పల్‌ మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతుందని.. బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలు, ఇళ్లు, ప్లాట్లను కోల్పోతున్నారు' అని వివరించారు.


'దక్షిణ భాగాన ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం పరిగణనలోకి తీసుకున్నట్టుగానే ఉత్తర భాగాన చౌటుప్పల్ వైపు 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకోవాలి' అని హరీశ్‌ రావు డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్నపుడు కోమటిరెడ్డి బాధితులతో ధర్నాలు చేసి ఇప్పుడేమో పోలీసు బలగాలతో బలవంతపెట్టడం దుర్మార్గం. ఇదెక్కడి న్యాయం? ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటనా?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు నిలదీశారు.


'నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చారు. నాడు ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు అలైన్మెంట్ మార్పు. అన్నారు నేడు మాట మార్చారు. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా?' అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. 'కోమటిరెడ్డికి మతి మరుపు ఎక్కువ అయినట్లు ఉంది. ఆయన చెప్పిన హామీల వీడియోలు పంపిస్తున్నా చూసుకోండి' అని తెలిపారు. 'జిల్లా మంత్రిగా.. శాఖ మంత్రిగా ఉన్నావు. నల్గొండ ప్రజలకు న్యాయం చేస్తావా? చరిత్రహీనుడుగా మింగుతావా?' అని ప్రశ్నించారు. బాధితులు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.