Chepa Prasadam: ఆస్తమా, శ్వాసకోశ బాధితులకు శుభవార్త.. చేప ప్రసాదం పంపిణీ ఆ రోజే!
Bathini Family Distribute Chepa Prasadam On June 8 To 9: మృగశిర కార్తె అంటే అందరికీ గుర్తొచ్చేది చేప ప్రసాదం. ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ షెడ్యూల్‌ను బత్తిని కుటుంబసభ్యులు విడుదల చేశారు.
Chepa Prasadam: దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన చేప ప్రసాదం తెలంగాణలో మరోసారి పంపిణీకి సిద్ధమైంది. మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బుసం, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వారికి వచ్చే నెలలో చేప మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబసభ్యులు ప్రకటించారు. గతంలో మాదిరి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎవరికీ ఏ ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
మృగశిర కార్తె అంటే అందరికీ చేప ప్రసాదం గుర్తుకు వస్తుంది. ఆస్తమా, ఉబ్బుసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడే వారికి చేప ప్రసాదం దివ్య ఔషధంగా గుర్తింపు పొందింది. ఈ మందు కోసం దేశ విదేశాల నుంచి బాధితులు తరలివస్తుంటారు. బత్తిని కుటుంబసభ్యులు ఇచ్చే చేప ప్రసాదంతో తమ సమస్యలు తగ్గుముఖం పడుతుందనే విశ్వాసం ఉంది. ఈ నమ్మకంతో లక్షల సంఖ్యలో చేప ప్రసాదం కోసం తరలివస్తుంటారు.
అయితే ఈ మందుపై వైద్యపరంగా ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా కూడా ప్రజల నమ్మకానికి సంబంధించిన అంశం కావడంతో చేప ప్రసాదం నిర్విరామంగా కొనసాగుతోంది. కాగా గతేడాది 2 లక్షల మందికి పైగా తాము చేప ప్రసాదం వేసినట్లు బత్తిని కుటుంబీకులు తెలిపారు. ఈ ఏడాది అంతకుమించి ప్రజలకు చేప ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే గత పదేళ్లుగా చేప ప్రసాదం పంపిణీకి నాటి సీఎం కేసీఆర్ సహకరించారు. నగర మంత్రులు దగ్గరుండి మరి చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేసేవారు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సహకరిస్తుందా? లేదా? వేచి చూడాలి. ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా బత్తిని కుటుంబసభ్యులు మాత్రం చేప ప్రసాదం పంపిణీని ఆపరు. కుదరకపోతే తమ ఇంటి వద్ద ప్రజలకు చేప మందును పంపిణీ చేస్తుంటారు.
చేప ప్రసాదం వివరాలు
ఎప్పుడు: జూన్ 8, 9
సమయం: ఉదయం 11 గంటల నుంచి తెల్లారి 11 గంటల వరకు. (మొత్తం 24 గంటలు)
ఎక్కడ: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం, హైదరాబాద్.
ఎవరు: బత్తిని కుటుంబసభ్యులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter