Munugode Voters gets Diwali 2022 Gifts from Telangana parties: తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. ప్రధాన పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. మునుగోడును ఎలాగైనా గెలవాలని ప్లాన్స్ వేస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో మునుగోడు ఎన్నిక ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు 'దీపావళి' ధమాకా ఆఫర్‌లు ఇస్తున్నాయి. ఉప ఎన్నిక సరిగ్గా పండుగ రోజుల్లోనే రావడం మునుగోడు నియోజక వర్గ ఓటర్లకు బాగా కలిసొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 24న దీపావళి పండగ ఉంది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. దాంతో మునుగోడు ఓటర్లకు 'దీపావళి' ఆఫర్‌లు ప్రధాన పార్టీలు అందిస్తున్నాయి. పురుషులకు మద్యం, మాంసం.. మహిళలకు చీరలు, గాజులు.. పిల్లలకు స్వీట్లు, టపాసుల బాక్సులు పంపిణీ చేస్తున్నాయట. ఇప్పటికే కొన్నిచోట్ల పంపిణీ ప్రారంభించగా.. మరికొన్నిచోట్ల పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఇక యువతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉన్నాయని తెలిసింది.


మొత్తం ఐదు వేల రూపాయల విలువ చేసే దీపావళి గిఫ్ట్ ప్యాక్‌ని ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక గ్రామ వార్డ్ మెంబర్స్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు బైక్‌లు, కార్లను పండుగ కానుకగా బుక్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఓటర్ల సంఖ్య తక్కువగానే (2 లక్షల 40 వేలు) ఉండటంతో.. భారీగా ఖర్చు చేసేందుకు రాజకీయ పార్టీలు వెనుకాడటం లేదట. ఇంటింటికీ దీపావళి గిఫ్ట్స్ పంపిణీ జరుగుతుండడంతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొందట. ఓటర్లు అందరూ ప్రతి రోజు ఎంజాయ్ చేస్తున్నారట. 


మునుగోడు విజయం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలకు ముఖ్యం కావడంతో.. భారీగా ఖర్చు పెడుతున్నాయి. అయితే ప్రధాన పార్టీ నేతలు.. ప్రజలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారో అని భయపడుతున్నారట. ఓటర్లు అందరిచ్చే కానుకలు తీసుకొని.. ఏ పార్టీకి మొండి చేయి చూపిస్తారో అని లోలోపల భయపడుతున్నారట. మునుగోడు ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో నవంబర్‌ 6న తేలనుంది. 


Also Read: IND vs PAK: తుది జట్టులో పంత్‌, కార్తీక్.. పాక్ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత్ టీమ్ ఇదే!


Also Read: మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం.. 1000 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook