Sunil Gavaskar picks India Playing XI vs Pakistan in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 శనివారం ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచులో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. ఆదివారం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లతో పాటుగా మాజీలు, ఫాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23న మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మ్యాచ్ నేపథ్యంలో మాజీలు అందరూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత తుది జట్టు కూర్పుపై దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు.
పాక్ మ్యాచ్‌లో వికెట్ కీపర్స్ రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లు ఇద్దరు ఉండాలని సునీల్ గవాస్కర్ సూచించారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అయిదో బౌలర్‌గా బరిలో దిగితే.. పంత్, కార్తీక్‌లకు తుది జట్టులో అవకాశం దక్కుతుందన్నారు. పంత్‌ను ఆరో స్థానంలో, కార్తీక్‌ను ఏడో స్థానంలో ఆడించాలని సూచించారు. ఆసీస్ పిచెస్ కాబట్టి భారత్ నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్‌లు, ఐదుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని సన్నీ చెప్పారు.
'హార్దిక్ పాండ్యాను ఆరో బౌలర్‌గా ఉపయోగించుకుంటే.. రిషబ్ పంత్‌కు జట్టులో చోటు కష్టం. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడి.. హార్దిక్‌ను అయిదో బౌలర్‌గా ఉపయోగించుకుంటే కార్తీక్ సహా పంత్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది. అప్పుడు పంత్ ఆరో స్థానంలో, కార్తీక్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. అయితే టాప్ ఆర్డర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఈ ఇద్దరికి ఎన్ని ఓవర్లు ఆడే అవకాశం వస్తుందో చెప్పలేం. గరిష్టంగా 3, 4 ఓవర్లు ఆడతారు. అప్పుడు ఇద్దరిలో ఎవరిని ముందు దింపాలో ఆలోచించుకోవాలి' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
సునీల్ గవాస్కర్ తుది జట్టు ఇదే:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
Also Read: Prince Movie Twitter Review : ప్రిన్స్ ట్విట్టర్ రివ్యూ.. యావరేజ్ అంటోన్న నెటిజన్లు
Also Read: దాతృత్వంలో తగ్గేదే లే అంటున్న శివ్ నాడార్... హురున్ ఇండియా జాబితాలో అగ్రస్థానం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook