Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ షూరు అయ్యింది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులంతా పోటీ పడుతున్నారు. ఈక్రమంలో అధికార టీఆర్ఎస్ తన అభ్యర్థి పేరును ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈమేరకు టీఆర్ఎస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మునుగోడు టికెట్‌ కోసం నేతలంతా పోటీ పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుదీర్ఘ చర్చల అనంతరం కూసుకుంట్ల వైపే సీఎం కేసీఆర్ మొగ్గారు. బీసీ నేతనే అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఐతే చివరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతనే ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సైతం తమ అభ్యర్థులను రెడ్డినే బరిలో నిలిపాయి. దీంతో సీఎం కేసీఆర్ సైతం రెడ్డి వర్గానికే చెందిన నేతలను పోటీలో నిలిపారు. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.


ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనేపథ్యంలోనే ఉప ఎన్నికకు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. వచ్చే నెల 3న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మునుగోడు స్థానాన్ని అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. అందుకే పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ చేశాయి.


ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. భారీ బహిరంగ సభలను సైతం చేపడుతున్నారు. నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో ప్రచారం మరింత ఉధృతంకానుంది. 2014 ఎన్నికల్లో మునుగోడు స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయదుంభిదుంభి మోగించారు. ఈసారి ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.


ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఆ వెంటనే రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. తాజాగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. వారం రోజులపాటు మంచి రోజులు ఉండటంతో నేతలంతా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 


[[{"fid":"247614","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read:మాల్దీవులకు రష్మిక, విజయ్.. సంధింగ్ సంధింగ్ అంటూ మళ్లీ రచ్చ!


Also read:మెగా మాస్ మానియా.. రెండో రోజు ఊపందుకున్న గాడ్ ఫాదర్..మొదటి రోజు కంటే ఎక్కువగా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook