Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికల్లో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నేతల వలసలు ఏ రేంజ్ లో సాగుతున్నాయి. ఎప్పుడు ఎవరూ ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం ఒక పార్టీలో ఉంటున్న నేత.. సాయంత్రానికి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎవరైనా లీడర్ కలిస్తే... ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగే పరిస్థితిలు ఉన్నాయి. రోజుకో కండువా మారుస్తున్న నేతలను చూసి జనాలు ముక్కున వేలేసేకుంటున్నారు. తాజాగా బీజేపీకి షాకిచ్చారు కీలక నేత. అధికార పార్టీలో చేరిపోయారు. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసిన రోజే కీలక నేత జంప్ కావడం కమలం పార్టీలో కలకలం రేపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమవారం చండూరులో అట్టహాసంగా నామినేషన్ వేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చండూరులో భారీ ర్యాలీ తీశారు. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సాగుతుండగానే.. అదే మండల జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. తన  అనుచరులతో సమావేశమై అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మూడు వారాల క్రితమే కర్నాటి కారు దిగి కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే తనను బలవంతంగా బీజేపీ లో చేర్చుకున్నారని వెంకటేశం చెప్పారు. గట్టుప్పల మండలం నోటిఫికేషన్ రాకపోవడం కూడా ఒక కారణం అన్నారు. తర్వాత నోటిఫికేషన్ రావడం, ఆఫీసులు ఓపెన్ కావడంతో అధికార పార్టీపై కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి కేటీఆర్ తనను టిఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారని కర్నాటి తెలిపారు. ఉప ఎన్నికలో గట్టుపల్ లో మెజార్టీ చూపిస్తే గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు వస్తాయని చెప్పారు. స్వయంగా కేటీఆర్  గట్టుప్పల ఇంచార్జ్ గా వస్తున్నందున.. టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు కర్నాటి వెంకటేశం.


కర్నాటి వెంకటేశం నెల రోజుల్లో మూడు పార్టీలు మారడం చర్చగా మారింది. చండూరు జడ్పీటీసీగా ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఏడాది క్రితం మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంత్రితో కలిసి ఉత్సాహంగా పని చేశారు. గట్టుప్పల్ మండల ప్రకటన తర్వాత భారీ సభ కూడా నిర్వహించి స్థానిక ప్రజా ప్రతినిధులను కారెక్కించారు. సడెన్ గా కారుకు షాకిచ్చిన కమలం పార్టీలో చేరిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో రాత్రికి రాత్రే కాషాయ కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. దీంతో అధికార పార్టీ నేతల బెదిరింపులతోనే కర్నాటి కనిపించకుండా పోయారనే వార్తలు వచ్చాయి. ఉపసమరంలో గట్టుప్పల్ ఇంచార్జ్ గా మంత్రి కేటీఆర్ వచ్చారు. అప్పటి నుంటే కర్నాటి మళ్లీ జంప్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా అది నిజమైంది.


కర్నాటి బాటలోనే ఇటీవల బీజేపీలో చేరిన మరికొంత మంది నేతలు తిరిగి అధికార పార్టీలోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి కూడా తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. గత రెండు, మూడు రోజులుగా టీఆర్ఎస్ ముఖ్యనేతలతో తాడూరి టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. చౌటుప్పల్ మండల ఇంచార్జుగా ఉన్న మంత్రి.. తాడూరితో మాట్లాడారని.. ఆయన తిరిగి టీఆర్ఎస్ చేరడం ఖాయమని చెబుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన కొన్ని రోజులకే అధికార పార్టీకు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు తాడూరి వెంకట్ రెడ్డి. అంతకుముందు ఆయన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలతో సమావేశం నిర్వహించారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని చెప్పారు. అయితే కూసుకుంట్లకు టికెట్ అనే సంకేతం మంత్రి జగదీశ్ రెడ్డి నుంచి రావడంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో తాడూరిపై పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపింది. కూసుకుంట్లపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


Also Read: IND vs SA: శ్రేయాస్-ఇషాన్ సూపర్ బ్యాటింగ్‌.. సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలు!


Also Read: Gold Price Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook