Munugode Bypoll : రేవంత్ రెడ్డికి సీనియర్ల షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!
Munugode Bypoll : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Munugode Bypoll : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొంత కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో ఆధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. కోమటిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా ఏఐసీసీ నుంచి వెంకట్ రెడ్డికి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ప్రియాంక గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన పీసీసీ ముఖ్య నేతలు అక్కడే ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత శ్రీధర్ బాబు హస్తినలో ఉన్నారు. ఈ నేతలతో కోమటిరెడ్డిని తీసుకుని ప్రియాంక గాంధీతో మాట్లాడించనున్నారని తెలుస్తోంది. అయితే పీసీసీ ముఖ్య నేతలు ఢిల్లీలో ఉన్నా.. రేవంత్ రెడ్డి మాత్రం మంగళవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రావడం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రియాంక గాంధీ పిలవడం తెలంగాణ కాంగ్రెస్ లో చర్చగా మారింది.
మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి విషయంలోనూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సీనియర్లు షాక్ ఇచ్చారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే మునుగోడు కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు బిల్డర్ చల్లమల్ల కృష్ణారెడ్డి. ఆర్థికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డే తెరపైకి తెచ్చారనే ప్రచారం ఉంది. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. చండూరు బహిరంగ సభ, తర్వాత నిర్వహించిన పాదయాత్రకు జనసమీకరణ అంతా చలమల్ల నేతృత్వంలోనే సాగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండదండలు ఉండటంతో మునుగోడు టికెట్ కృష్ఠారెడ్డికి ఖరారైందనే చర్చ కాంగ్రెస్ వర్గాలతో పాటు మునుగోడు నియోజకవర్గంలో సాగుతోంది. అయితే అభ్యర్థి విషయంలో రేవంత్ కు పార్టీ సీనియర్లు షాక్ ఇచ్చారని తెలుస్తోంది. కృష్ణారెడ్డి పేరును హైకమాండ్ ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా.. సీనియర్ నేతలు మాత్రం మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పేరును సూచించారని సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు కూడా స్రవంతికై జైకొట్టారని అంటున్నారు. దీంతో హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన చల్లమల్ల కృష్ణారెడ్డిని కాకుండా పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ సమక్షంలో సమావేశమైన రాష్ట్ర నేతలు సమిష్టిగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. అభ్యర్థిని వీలైనంత త్వరగాప్రకటించి నియోజకవర్గంలో ప్రచారానికి దిగాలని అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ వచ్చారు. గాంధీ భవన్ లో నల్గొండ జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశం అయి అభ్యర్థి ఎంపిక పై వారితో తుద చర్చలు జరపనున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో జరిగిన సమావేశంలో నల్గొండ జిల్లా నేతల అభిష్టం మేరకే అభ్యర్థి ఎంపిక ఉండాలని నిర్ణయానికి రాగా.. గాంధీభవన్ సమావేశంలో అభ్యర్థి ఎవరనేదానిపై చర్చ జరిపి అధిష్టానానికి రెండు పేర్లతో కూడిన జాబితా అందించేలా ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్థి రేసుసులో చాలా పేర్లను పరిశీలించినప్పటికీ ఫైనల్ గా రెండు పేర్లు చిరుమళ్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి దగ్గర ఆగాయి. చివరికి సీనియర్ల సూచనతో స్రవంతిని ఓకే చేశారని అంటున్నారు.
2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతికి 27,441 ఓట్లుతో రెండోస్థానంలో నిలిచారు. మునుగోడు నియోజకవర్గం నుంచి పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం స్రవంతికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకొస్తున్నారు. కృష్ణారెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నా నియోజకవర్గంలో ఎవరికి తెలియకపోవడం ఆయనకు మైనస్ గా మారిందని అంటున్నారు. స్రవంతికి టికెట్ ఇస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కూల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని హైకమాండ్ భావనగా ఉందంటున్నారు. అయితే కొన్ని రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూ ఖర్చు చేస్తున్న కృష్ణారెడ్డికి హైకమాండ్ ఎలాంటి హామీ ఇస్తుంది.. ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.
Read Also: ADANI NDTV DEAL: మీడియా కాదు మోడియా... ఎన్డీటీవీ అదానీ డీల్ పై కేటీఆర్ సెటైర్లు
Read Also: LPG Cylinder Price: గ్యాస్ సిలెండర్ ధర కేవలం 750 రూపాయలే, వెంటనే బుక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి