Munugode Bypoll: మునుగోడు ఓటర్లకు బిగ్ షాక్? ఉప ఎన్నికలో సంచలనం జరగబోతోందా..?
Munugode Bypoll: మునుగోడు ఓటర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఉప ఎన్నికపై ఆయన హైకోర్టులో పిల్ వేశారు. మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించారు
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా మునుగోడులో పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. అటు మునుగోడు ఓటర్లు తమ పంట పండనుందే ఆశతో ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలోనూ అధికార పార్టీ భారీగా ఖర్చు చేసింది. ఓటర్లకు నాలుగు నుంచి ఆరు వేల వరకు పంచింది. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు 10 వేలు కూడా ఇచ్చారు. హుజురాబాద్ ను మించి మునుగోడులో ఓటర్లకు తాయిలాలు ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ఓటుకు 30 వేలు ఇచ్చేందుకు కూడా పార్టీలు సిద్ధమవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో మునుగోడు జనాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
మునుగోడు విషయంలో ఓటర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఉప ఎన్నికపై ఆయన హైకోర్టులో పిల్ వేశారు. ఉప ఎన్నికలో పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని.. వెంటనే దీన్ని నియంత్రించాలని తన పిటిషన్ లో కోరారు కేఏ పాల్. మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించారు. మునుగోడు ఉప ఎన్నికపై సుప్రీంకోర్టులో కూడా పిటీషన్ వేస్తామని కేఏ పాల్ ప్రకటించారు. అటు కేంద్ర ఎన్నికల సంఘానికి పాల్ ఫిర్యాదు చేశాడు. నామినేషన్లకు ముందే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కోట్లాది రూపాయలు పంచేస్తున్నాయని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఓటర్లకు డబ్బులు బహుమతులు పంచుతున్నారని చెప్పారు.
కేఏ పాల్ పిటిషన్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది.. హైకోర్టులో ఏం వస్తుందన్నది ఆసక్తిగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల బరిలో ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ప్రజా గాయకుడు గద్దర్ ను మునుగోడు నుంచి పోటీ చేయిస్తున్నారు గద్దర్. తాజాగా ఆయన బైపోల్ ను ఆపాలంటూ కోర్టుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాకా ఆపే పరిస్థితులు దాదాపుగా ఉండవంటారు. అయితే డబ్బుల పంపిణి విషయంలో మాత్రం హైకోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో తమ పంట పండుతుందనే ఆశతో ఉన్న మునుగోడు ఓటర్లు.. కేఏ పాల్ పిటిషన్ తో కొంత నిరాశలో ఉన్నారని తెలుస్తోంది.
Read Also: Munugode Bypoll: రేవంత్ రెడ్డిపై హైకమాండ్ ఫైర్.. బాధ్యత తీసుకోవాలని సీరియస్ వార్నింగ్?
Read Also: Acharya : 80 శాతం రెమ్యూనరేషన్ వాపస్.. ఆచార్య పేరు ఎత్తేందుకు ఇష్టపడని చిరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook