Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్....
Munugode Byelection: తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనుండంతో ఆ పార్టీ అభ్యర్థిగా ఆయనే ఉండనున్నారు.
Munugode Byelection: తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనుండంతో ఆ పార్టీ అభ్యర్థిగా ఆయనే ఉండనున్నారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఆ రెండు పార్టీల్లోనూ అసమ్మతి భగ్గుమంటోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తమ అసమ్మత్మిని బహిరంగంగానే బయటపెడుతున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసమ్మత్తిని క్యాష్ చేసుకునేందుకు కమలం పార్టీ ఎత్తులు వేస్తుందని తెలుస్తోంది.
మునుగోడులో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. అయితే ఉప ఎన్నికలో అధికార పార్టీతో పాటు బలమైన రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టే బలమైన అభ్యర్థి కనిపించడం లేదు. మునుగోడులో పోటీ చేసేందుకు మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతితో పాటు నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు పున్నా కైలాస్ , పల్లె రవికుమార్ గౌడ్ ఉత్సాహంగా ఉన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన చెరుకు సుధాకర్ గౌడ్ కూడా పార్టీ టికెట్ ఇస్తే పోటికి సిద్దమంటున్నారు. వీళ్లతో పాటు కొత్తగా వ్యాపారవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. కోమటిరెడ్డితో పాటు అధికార పార్టీని ఉప ఎన్నికలో ఎదుర్కొవాలంటే ఆర్థిక సంపన్నుడు కావాలని భావిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బడా కాంట్రాక్టర్ అయిన కృష్ణారెడ్డి రంగంలోకి దింపారని అంటున్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కేడర్ తో ఆయన మమేకం అవుతున్నారు. ఇటీవల చండూరులో నిర్వహించిన సభ ఏర్పాట్లు ఆయనే చేశారు. ఇదే ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది. కొత్తగా వచ్చిన కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదంటూ పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. ఈ ఘటనతో మునుగోడులో కాంగ్రెస్ లో వర్గపోరు తీవ్రంగా ఉందని తెలుస్తోంది.
అటు అధికార గులాబీ పార్టీలో ముసలం మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా దాదాపు 12 మంది ముఖ్యనేతలు ఏకంగా సీఎం కేసీఆర్ కు లేఖ రాశారాని తెలుస్తోంది. నియోజకవర్గంలోని పార్టీ నేతలను వేధించినా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన కూసుకుంట్లకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అసమ్మతి నేతలు తేల్చిచెబుతున్నారు. అసమ్మతి నేతలు హైదరాబాద్ లో రహస్యంగా సమావేశం కాడవం కారు పార్టీలో కలకలం రేపింది. దీంతో అసమ్మతి నేతలను బుజ్జగించారు మంత్రి జగదీశ్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశమై చర్చించారు జగదీశ్ రెడ్డి. మంత్రి సమావేశంలో కూసుకుంట్ల తీరుపై నియోజకవర్గ నేతలు ఎండగట్టారని తెలుస్తోంది. కూసుకుంట్ల టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కూడా తేల్చి చెప్పారట. అయితే అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని.. సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుందామంటూ జగదీశ్ రెడ్డి నేతలను కూల్ చేశారని చెబుతున్నారు. మంత్రితో సమావేశం తర్వాత బయటికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటామని ప్రకటించారు. అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నది అనుమానమే అంటున్నారు.
మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ లో అసమ్మతి దుమారం రేపుతుండగా... బీజేపీ మాత్రం సైలెంట్ గా తమ పని తాను చేసుకుపోతోంది. ఈనెల 21న బీజేపీ లో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా కోమటిరెడ్డికి మద్దతుగా వస్తున్నారు. మండలాల వారీగా లీడర్లతో కోమటిరెడ్డి మాట్లాడుతూ తనతో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మునుగోడుపై బీజేపీ పెద్దలు ఫోకస్ చేశారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని సమస్యలతో పాటు పార్టీ బలాబలాలు, బలహీనతలను తెలుసుకునేందుకు అమిత్ షా తన టీంను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మందికి పైగా సభ్యులు రహస్యంగా తమపని తాము చేసుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో తమకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను అమిత్ షాకు నివేదిస్తుందట ఢిల్లీ టీమ్. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో వర్గపోరు తమకు కలిసివస్తుదంని భావిస్తున్న కమలనాధులు.. ఆ రెండు పార్టీల్లోని అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నారని చెబుతున్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థిని ప్రకటించాకా అసమ్మతి బయటికి వస్తుందని.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న నేతలతో ఇప్పటికే కోమటిరెడ్డి టచ్ లోకి వెళ్లారంటున్నారు. ఆర్థికంగా సాయం చేయడంతో పాటు భవిష్యత్ పై భరోసా ఇస్తున్నారని అంటున్నారు. 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ లోని కొందరు నేతలు కోమటిరెడ్డికి సహకరించారనే టాక్ ఉంది. మొత్తంగా మునుగోడులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తుండటంతో ఎన్నికల నాటికి కీలక పరిణామాుల ఉంటాయనే టాక్ వస్తోంది.
Read also: Shilpa Shetty: షూటింగ్లో ప్రమాదం.. కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి!
Read also: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook