Munugode Byeelction: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ సవాల్ గా తీసుకుంది. సీఎం కేసీఆరే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన రెండు వారాల్లోనే మునుగోడులో భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతున్నారు. అయితే మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించినా అసమ్మతి నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఖరారైందనే ప్రచారం సాగుతుండగా.. కూసుకుంట్ల టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాటలను పట్టించుకోవడం లేదు అసమ్మతి నేతలు. దేనికైనా సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తనను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారని, తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.  కూసుకుంట్ల ప్రభాకర్ కి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించినందుకే  తనపై  అసత్య ఆరోపణలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తన సొంత గ్రామ రైతులను రెచ్చగొట్టి.. తనపై ఉసిగొల్పుతున్నాడని తెలిపారు. ఇటీవల జరిగిన అసమ్మతి నేతల మీటింగ్ కు హాజరైన నేతలకు ఫోన్లు చేసి కూసుకుంట్ల బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. పోలీసుల చేత వార్నింగ్ లు ఇప్పిస్తున్నాడని చెప్పారు. కూసుకుంట్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని.. కూసుకుంట్ల వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి చెప్పారు. మునుగోడు టికెట్ కూసుకుంట్లకు ఇస్తే నియోజకవర్గం మొత్తం తిరిగి అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. పార్టీపై తనపై చర్య తీసుకున్నా ఫర్వాలేదన్నారు.


మునుగోడు టికెట్ రేసులో ఉన్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణా రెడ్డి కూడా మంత్రి జగదీశ్ రెడ్డిని లెక్క చేయడం లేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు కంచర్ల కృష్ణారెడ్డి. టికెట్ ఎవరికి వచ్చినా అందరు కలిసి పని చేయాలని కృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి సూచించారనే వార్తలు వచ్చాయి. అయితే కంచర్ల మాత్రం మంత్రి జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు, నారాయణపురం మండలాల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. అయితే మంత్రి నియోజకవర్గంలో తిరుగుతుండగా పట్టించుకోని కృష్ణారెడ్డి.. హైదరాబాద్ లో ప్రత్యేకంగా చేరికల కార్యక్రమం పెట్టుకున్నారు.


జగదీశ్ రెడ్డి మునుగోడు మండలంలో ఉన్న సమయంలోనే మునుగోడు మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ సర్పంచ్ లు, ఎంపీటీసీలను హైదరాబాద్ తీసుకువెళ్లి.. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేర్చించారు కంచర్ల కృష్ణారెడడ్ి. మునుగోడు నియోజకవర్గ నేతలకు మాజీ స్పీకర్ మధుసూదనాచారీ, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పార్టీ జెండాలు కప్పించారు. మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గంలో ఉండగా.. అతన్ని కాదని తెలంగాణ భవన్ లో కంచర్ల జాయినింగ్స్ పెట్టుకోవడం చర్చగా మారింది. జగదీశ్ రెడ్డితో తమకు సంబంధం లేదనేలా కంచర్ల వ్యవహరించారని అంటున్నారు. ఈ ఘటనతో జగదీశ్ రెడ్డి షాకయ్యారని తెలుస్తోంది. అసమ్మతి నేతల వరుస కార్యక్రమాలతో మునుగోడు టీఆర్ఎస్ నిట్టనిలువునా చీలుతుందనే ప్రచారం సాగుతోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే టీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. 


Read Also: Khammam Murder: తుమ్మల ప్రధాన అనుచురుడు దారుణ హత్య.. స్వాతంత్ర దినోత్సవం రోజునే దారుణం


Read Also: Attack on Bandi Sanjay: బండి సంజయ్ పై రాళ్ల దాడి.. జనగామలో తీవ్ర ఉద్రిక్తత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook