Munugode Voters: కేసీఆర్ ను నిన్న పొట్టుపొట్టు తిట్టింది.. నేడు జై కొట్టింది.. మునుగోడులో నేతలే కాదు ఓటర్లది యూటర్నే!
Munugode Voters: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి.ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. రోజుకో పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు.
Munugode Voters: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. రోజుకో పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు. దీంతో ఏ లీడర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరూ ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే లీడర్లే రోజుకో పార్టీ జంప్ చేస్తున్నారో తమకేం తక్కువ అనుకుంటున్నారో ఏమో.. ఓటర్లు కూడా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. మూడు పార్టీలకు జై కొడుతున్నారు. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టిన మహిళ.. తర్వాత రోజే కండువా మార్చేసింది. గులాబీ జెండా కప్పుకుని.. కేసీఆర్ కు జై కొట్టింది.
మునుగోడు చండూరు మండలం కొండాపురం గ్రామంలో బుధవారం బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. అయితే చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ ఓ మహిళ వీరంగం వేసింది. సీఎం కేసీఆర్ ను పొట్టుపొట్టుగా తిట్టింది. కేసీఆర్.. ఈ చీరలే నీ కుటుంబ సభ్యులు కట్టుకుంటారా అంటూ నిలదీసింది. దరిద్రపు చీరలు ఎవరూ ఇయమన్నారంటూ మండిపడింది. కేసీఆర్ ను తిట్టిన మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేసీఆర్ ను తిట్టిన వీడియో వైరల్ కావడంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు రంగంలోకి నష్ట నివారణ చర్యలకు దిగారు. ఛీరెలు పాడుగాను అంటూ పొట్టు పొట్టుగా తిట్టిన మహిళ దగ్గరకు వెళ్లి ఆమెను బుజ్జగించారు. తర్వాత ఏమైందో ఏమో .. కేసీఆర్ ను తిట్టిన ఆ మహిళ ఏకంగా మెడలో టీఆర్ఎస్ జెండా కప్పేసుకుంది. కేసీఆర్ కు జై కొట్టింది. కేసీఆర్ ప్రభుత్వం తమకు ఎంతో సాయం చేసిందని కొనియాడింది. కేసీఆర్ ను జైకొడుతూ మహిళ మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. [[{"fid":"246913","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"1":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
కొండాపురం మహిళ యూటర్న్ ఘటనపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. విపక్ష పార్టీల నేతలు ఐదు వందల రూపాయలు ఇచ్చి బతుకమ్మ చీరలపై విమర్శలు చేయించారని తెలుస్తోంది. అందుకే ఆ మహిళ రెచ్చిపోయి కేసీఆర్ ను తిట్టిందని అంటున్నారు. తర్వాత అధికార పార్టీ నేతలు వెళ్లి మరిన్ని తాయిలాలు ఇయ్యడంతో ఆమె మాట మార్చిందని తెలుస్తోంది. మరోవైపు రాజకీయ నేతలు గంటకో పార్టీ మారుతున్నప్పుడు.. ఓటర్లు మాట మారిస్తే తప్పేంటనే అభిప్రాయం నియోజకవర్గ జనాల్లో వ్యక్తమవుతోంది.
Read Also: TRS VS MIM: పీకే బాటలోనే ఎంఐఎం.. కేసీఆర్ తో దోస్తీ కటీఫ్! 30 నియోజకవర్గాల్లో కారుకు గండం..
Read Also: Telangana Rain Alert : తెలంగాణలో మరో వారం కుండపోతే.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.