దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఎన్నిక మునుగోడు ఉపఎన్నిక. క్షణక్షణం ఉత్కంఠ రేపిన ఫలితం. ప్రారంభంలోని ఐదు రౌండ్ల ఫలితాలు అలానే సాగినా..క్రమంగా అధికార పార్టీ మెజార్టీ పెంచుకుంటూ పోయింది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడులో మొత్తం 241805 మంది ఓటర్లుండగా..ఇందులో 225192 మంది ఓటేశారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. బీజేపీ ఆధిపత్యం ఉంటుందనుకున్న స్థానాల్లో టీఆర్ఎస్ పట్టు సాధించింది. అటు కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. ఐదవ రౌండ్ ఫలితాలు వెలువడటం ఆలస్యం కావడంతో..ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ నేతలు ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల సంఘం సీఈవోను ఫోన్‌లో నిలదీసిన పరిస్థితి.


ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగింది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకు 228 ఓట్లు రాగా, బీజేపీకు 224 ఓట్లు దక్కాయి. అంటే టీఆర్ఎస్ కేవలం 4 ఓట్ల మెజార్టీ సాధించింది పోస్టల్ బ్యాలెట్స్‌లో.


ఇక తొలి రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1192 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆ తరువాత రెండవ రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధిదే ఆధిక్యం కొనసాగింది. రెండవ రౌండ్ ముగిసేసరికి 1352 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించారు. ఆ తరువాత మూడు, నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించింది. మూడవ రౌండ్ ముగిసేసరికి మాత్రం బీజేపీ అభ్యర్ధి దాదాపు 450 ఓట్ల ఆధిక్యం సాధించారు. నాలుగవ రౌండ్ ముగిసేసరికి మళ్లీ టీఆర్ఎస్ 714 ఓట్ల ఆదిక్యంలో వచ్చేశారు.


ఇక ఐదవ రౌండ్ ఫలితాల సమయంలో ఉత్కంఠ చాలాసేపు కొనసాగింది. ఈసీ టీ బ్రేక్ కారణంతో ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఈలోగా టీఆర్ఎస్, బీజేపీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరికి ఫలితాలు విడుదలై..టీఆర్ఎస్ 638 ఓట్ల స్వల్ప మెజార్టీతో కొనసాగింది. ఇక ఐదు రౌండ్ల వరకూ స్వల్ప మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధికి 6వ రౌండ్ బ్రేక్ ఇచ్చింది. ఈ రౌండ్‌లో మెజార్టీ ఎక్కువ రావడంతో..టోటల్ మెజార్టీ 2258కు పెరిగింది. 


ఇక అప్పట్నించి  రౌండ్‌కు 400-500-600 చొప్పున మెజార్టీ పెంచుకుంటూ పోయింది ఆధికార టీఆర్ఎస్ పార్టీ.  పదవ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం 4416 ఓట్లకు చేరుకుంది. 11వ రౌండ్ ముగిసేసిరిక టీఆర్ఎస్ ఆధిక్యం మరో వేయి ఓట్లు పెరిగింది. అంటే 10వ రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆధిక్యం ప్రతి రౌండ్‌కు వేయికి పైగా ఓట్లు  సాధించుకుంటూ కొనసాగింది. 11వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం 5774 ఓట్లకు పెరిగింది. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్ ఏకంగా 2 వేల ఓట్ల ఆధిక్యం సాధించడంతో ఓవరాల్ మెజార్టీ 7836 ఓట్లకు పెరిగింది.


13వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధికి మరో వేయి ఓట్ల ఆధిక్యం లభించడంతో..మొత్తం మెజార్టీ 9,039 ఓట్లకు చేరుకుంది. తరువాత 14వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి మెజార్టీ 10 వేల ఓట్లు దాటేసింది. ఇక చివరి రౌండ్ 15వది ముగిసేసరికి టీఆర్ఎస్ మెజార్టీ 11 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం ఖరారు చేసుకున్నారు. 


Also read: Munugode Result Live Updates: మునుగోడులో టీఆర్ఎస్ జెండా.. 10,297 ఓట్లతో కూసుకుంట్ల విన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook