Komati Reddy Rajagopal Reddy: రేపు(సోమవారం) ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలవనున్నారు. ఇప్పటికే తాను ప్రకటించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని అందించనున్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాను సమర్పించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను రాజగోపాల్‌రెడ్డి కలిశారు. అప్పుడే పార్టీలో చేరికపై క్లారిటీ వచ్చింది. ఆ సమయం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటూ..టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై విమర్శలు సంధిస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్‌ను ఓడించాలంటే అది బీజేపీ సాధ్యమని ఒక్కసారిగా హాట్ కామెంట్స్ చేశారు. దీంతో పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చింది.


ఆ తర్వాత ఊహాగానాలను అనుగుణంగానే కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్‌ను వీడేందుకు గల కారణాలను వివరించారు. కొందరు వ్యక్తుల వల్లే పార్టీ నాశనం అవుతోందని మండిపడ్డారు. జైలు నుంచి వచ్చిన వారికి పార్టీలో గుర్తింపు ఉందని ఆరోపించారు. పార్టీ బతకాలంటే నేతల్లో మార్పులు రావాలని లేఖలో వివరించారు. మరోవైపు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


ఈనెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ ద్వారా కమల తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీలో రాజగోపాల్‌రెడ్డికి కీలక పదవి రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉప ఎన్నికలే టార్గెట్‌గాబీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. హుజురాబాద్‌లో ఎలాంటి ఫలితం వచ్చిందో..అదే రిజల్స్‌ను రిపీట్ చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అదే ఫలితాలను మునుగోడు చూపించాలని కమలనాథులు యోచిస్తున్నారు.


Also read:Viral Video: రెస్ట్ రూమ్‌కు వెళ్తున్నారా..తస్మాత్ జాగ్రత్త..ఎందుకో వీడియో చూడండి..!


Also read:CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ అమ్మాయి పంచ్..నిఖత్ జరీన్‌కు స్వర్ణం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook