Nagarkurnool: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. సాధారణంగా పండ్ల గింజలు, కాయిన్స్ పిల్లల గొంతులో ఇరుక్కొని చనిపోయిన సంఘటనలు చూసుంటాం. కానీ కోడిగుడ్డు గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నీలమ్మ(50) ఇంట్లో భోజనం చేస్తూ ఉడకబెట్టిన కోడిగుడ్డును తినేందుకు నోట్లో పెట్టుకోగా.. గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. దీంతో ఆమె ఊపిరాడక అక్కడికక్కడే పడిపోయింది. కుటుంబ సభ్యులు గుర్తించి గొంతులో గుడ్డుని బయటికి తీసే ప్రయత్నం చేశారు.. ఈలోగానే ఆమె మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.


Also read: wall collapse: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం... గోడ కూలి ఐదుగురి మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook