wall collapse: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం... గోడ కూలి ఐదుగురి మృతి

wall collapse: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అయిజ మండలంలోని కొత్తపల్లిలో రాత్రి కురిసిన వర్షానికి గుడిసె కూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 12:09 PM IST
  • జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం
  • గోడ కూలి..ఐదుగురు మృతి
  • మృతుల్లో ముగ్గురు చిన్నారులు
wall collapse: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం... గోడ కూలి ఐదుగురి మృతి

wall collapse: తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal district)లో దారుణం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడ కూలి(wall collapse) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. అయిజ మండలం కొత్తపత్తిలో ఓ కుటుంబం పూరి గుడిసెలో నిద్రిస్తుండగా వర్షానికి నానిన గోడ రాత్రి సమయంలో ఒక్కసారిగా కూలింది. దీంతో గోడ పక్కనే నిద్రిస్తున్న కుటుంబ యజమాని మోష, భార్య శాంతమ్మ, పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరో ఇద్దరు పిల్లలు స్నేహ, చిన్న ప్రాణాలతో బైటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Also read; Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News