Naini Narsimha Reddy: నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
హైదరాబాద్: తెలంగాణ మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ( Former home minister Nayani Narshimha Reddy ) ఆరోగ్యం మరింత విషమించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న నాయిని నర్సింహా రెడ్డికి వారం రోజుల క్రితం జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 test ) కరోనా నెగటివ్ ఫలితం వచ్చింది.
హైదరాబాద్: తెలంగాణ మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ( Former home minister Nayani Narshimha Reddy ) ఆరోగ్యం మరింత విషమించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న నాయిని నర్సింహా రెడ్డికి వారం రోజుల క్రితం జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 test ) కరోనా నెగటివ్ ఫలితం వచ్చింది. అంతకంటే ముందుగా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఆయనకు 16 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఇక ఆయన త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తారని కుటుంబసభ్యులు ఆశిస్తున్న తరుణంలోనే ఆయనకు ఉన్నట్టుండి ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయాయి. Also read : Telangana floods: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్
నాయిని నర్సింహా రెడ్డికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ ( Lungs infection ) సోకి న్యుమోనియాగా మారిందని నిర్ధారించారు. దీంతో మరింత మెరుగైన చికిత్స నిమిత్తం మంగళవారం ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. Also read : LRS last date: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు