Naini Narsimha Reddy`s death: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మృతి
Naini Narsimha Reddy passes away: హైదరాబాద్: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఇక లేరు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ( Lungs infection ) బాధపడుతూ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవలే కరోనావైరస్ ( Coronavirus ) సోకడంతో కుటుంబసభ్యులు ఆయన్ని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేర్పించారు.
Naini Narsimha Reddy passes away: హైదరాబాద్: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఇక లేరు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ( Lungs infection ) బాధపడుతూ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటాక 12.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇటీవలే కరోనావైరస్ ( Coronavirus ) సోకడంతో కుటుంబసభ్యులు ఆయన్ని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందిన నాయినికి పది రోజుల క్రితం చేసిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. Also read : Telangana Covid-19: కొత్తగా 1,579 కరోనా కేసులు
కరోనావైరస్ ( COVID-19 ) నుంచి కోలుకున్న నాయిని నర్సింహా రెడ్డి త్వరలోనే ఇంటికి చేరుకుంటారని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు భావిస్తున్న క్రమంలోనే మరోసారి ఆయన అనారోగ్యం బారినపడ్డారు. వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు ఈసారి ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ( Lungs Infection after COVID-19 ) సోకిందని గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం నాయినిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తుల్లోకి భారీగా ఇన్ఫెక్షన్ చేరి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన్ను బతికించుకునేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. Also read : Rats in ICU: ఐసీయూలో పేషెంట్స్ చుట్టూ ఎలుకలు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe