Watch video of rats in ICU: సేలం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో తిష్టవేసిన నిర్లక్ష్యానికి నిదర్శనంగా తాజాగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆస్పత్రిలోని ఐసీయూలో ఎలుకలు తిరుగుతుండటాన్ని వైరల్‌గా మారిన ఈ వీడియోలో చూడవచ్చు. తమిళనాడులోని సేలం ప్రభుత్వ సూపర్ స్టెషాలిటీ ఆస్పత్రిలో కనిపించిన ఈ దృశ్యాన్ని ఓ పేషెంట్ తన మొబైల్ కెమెరాతో రికార్డ్ చేశారు. ఐసీయూలో ఆక్సిజెన్ పైప్స్, మెడిసిన్స్, పేషెంట్ ఫుడ్ ఉండే చోట ఈ ఎలుకలు ( Rats around patients in ICU ) స్వైర విహారం చేస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. అన్నింటికి మించి ఐసీయూ బెడ్స్‌పై పేషెంట్స్ పడుకుని ఉండగానే ఈ ఎలుకలు వారిపై నుంచే ఐసీయూ అంతా కలియ తిరగడం అక్కడి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. Also read : TET certificate validity: టెట్ సర్టిఫికెట్ విషయంలో NCTE కీలక నిర్ణయం
A patient admitted to Government Super Speciality Hospital in #Salem district recorded videos of several rats roaming inside the ICU. After complaints, authorities laid rat traps and caught few of them. CM home town hospital pic.twitter.com/CtTql6sqyU
— Imcool Rafi (@imcoolrafi) October 20, 2020
ఆస్పత్రి గోడలు, సీలింగ్‌లోంచే ఎలుకలు ( Rats ) ఐసీయూ లోపలికి ప్రవేశిస్తున్నాయని, పేషెంట్స్‌కి ఎక్కించే ఆక్సిజన్ పైపులను ఎలుకలు కొరికితే ఆ పేషెంట్స్ పరిస్థితి ఏంటని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయమై సదరు మెడికల్ కాలేజీ డీన్ మాట్లాడుతూ.. ''రాత్రివేళ ఐసీయులో ఎలుకలు తిరుగుతున్నాయని గుర్తించామని, ఎలుకలు పట్టుకునేందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశాం'' అని అన్నారు. 40 చోట్ల ఎలుకల బోనులు పెట్టామని తెలిపారు. ఎలుకల నివారణ కోసం ఎలుకల మందు కూడా పెట్టించామని, మంగళవారం రాత్రి నాటికే సిబ్బంది కనీసం 50 ఎలుకలు పట్టుకున్నారని డీన్ పేర్కొన్నారు. Also read : Dislike button on youtube channel: ప్రధాని మోదీ వీడియోపై డిజ్‌లైక్స్ బటన్ ఆఫ్ !