తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి  పార్టీ నేత నాయని నరసింహా రెడ్డి ( Nayani Narasimha Reddy ) సతీమణి అహల్య ( 68 ) రెడ్డి సోమవారం నాడు కన్నుమూశారు. నాయని మరణించిన నాలుగు రోజులు కూడా గడవక ముందే ఆయన సతీమణి కూడా కన్నుమూయడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్


వారం రోజుల్లోనే తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో నాయని కుమార్తె, కుమారుడు బాధ వర్ణించలేని విధంగా ఉంది. అక్టోబర్ 22న నాయని నరసింహా రెడ్డి ఆసుపత్రిలో కన్నుమూశారు. కరోనావైరస్ ( Coronavirus ) సోకడంతో ఆయన గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందుకుంటూ తుదిశ్వాస విడిచారు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR