TRS Rajyasabha Seats: రాజ్యసభ సీట్లను కేసీఆర్ బేరం పెట్టారా? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
TRS Rajyasabha Seats: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థులపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అధికారికంగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు సీఎం కేసీఆర్. అయితే ఎవరూ ఊహించని విధంగా ముగ్గురు పారిశ్రామికవేత్తలను పెద్దల సభకు ఎంపిక చేశారు. రాజ్యసభకు ముగ్గురు వ్యాపారవేత్తలను ఎంపిక చేయడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
TRS Rajyasabha Seats: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థులపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అధికారికంగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు సీఎం కేసీఆర్. అయితే ఎవరూ ఊహించని విధంగా ముగ్గురు పారిశ్రామికవేత్తలను పెద్దల సభకు ఎంపిక చేశారు. హెటిరో గ్రూప్ బండి పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, గ్రానెట్ వ్యాపారి వద్దిరాజు రవి చంద్రను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు గులాబీ బాస్. ఇదే ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. కేసీఆర్ తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాజ్యసభకు ముగ్గురు వ్యాపారవేత్తలను ఎంపిక చేయడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మూడు సీట్లలో రెండు ఓసీ, ఒకటి బీసీకీ ఇచ్చారు కేసీఆర్. అయితే బీసీ కోటాగా చెప్పుకుంటున్న మున్నూరు కాపు వద్దిరాజు రవిచంద్ర ఆర్థికంగా బలవంతుడు. దీంతో అతన్ని బీసీగా కాకుండా వ్యాపారవేత్తగానే అభివర్ణిస్తున్నారు నెటిజన్లు.
రాజ్యసభకు పంపడానికి సామాన్యులు ఎవదూ దొరకలేదా కేసీఆర్ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఎస్సీ, ఎస్టీలు ఎవరూ లేరు. కేశవరావు, సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపీలుగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన బండ ప్రకాశ్ రిజైన్ చేయడంతో ఆయన సీటు ఖాళీ అయింది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది. అంటే ఇద్దరు బీసీలు, ఒక ఓసీ సీటు ఖాళీగా ఉన్నాయి. అయితే కేసీఆర్ మాత్రం రెండు ఓసీలకు, మరొకటి బీసీ వర్గానికి చెందిన వ్యాపారవేత్తకు కట్టబెట్టారు. దీనిపై బీసీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీసీ వర్గాల నేతలు పార్టీకి ఫండ్ ఇవ్వలేరు కాబట్టే.. అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీల నుంచి రాజ్యసభల ప్రాతినిధ్యం లేదు. ఈ వర్గాలు కూడా కేసీఆర్ తీరుపై భగ్గుమంటున్నాయి. మాజీ ఎంపీలు మంధా జగన్నాధం, సీతారాం నాయక్ లు రాజ్యసభ సీటు ఆశించారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. టీఆర్ఎస్ కోసం పీకే టీమ్ సర్వేలు చేయడం ఇందుకు బలాన్నిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు కాబట్టే కేసీఆర్ సర్వేలు చేయిస్తున్నారనే టాక్ వస్తోంది. 2023 మార్చిలోనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బండ గుద్ది మరీ చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే వరుస కార్యక్రమాలు చేపడుతూ జాతీయ నేతలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ నిధులు సమీకరిస్తున్నారనే చర్చ వస్తోంది. ఎన్నికల కోసమే రాజ్యసభ సీట్లను బేరానికి పెట్టారని కొందరు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. అందుకే జనాలు ఏమనుకుంటారోనన్న ఆందోళన లేకుండా మూడు సీట్లను పెద్దలకు పంచి పెట్టారని మండిపడుతున్నారు.
మరోవైపు కేసీఆర్ వ్యూహాలకు సంబంధించి మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ నేతలకు ఆర్థిక వనరులకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే సిగ్నల్స్ ఇచ్చారని అంటున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో.. వచ్చే ఎన్నిక్లలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్ల వరకు పార్టీ ఫండ్ ఇస్తానని కేసీఆర్ పార్టీ నేతలకు భరోసా ఇచ్చారని అంటున్నారు. ఇందుకోసమే కేసీఆర్ నిధులు సమకూర్చుకుంటున్నారని, రాజ్యసభ సీట్లను వ్యాపారవేత్తలకు కట్టబెట్టి.. వాళ్ల ద్వారా డబ్బులు సేకరించారనే ఆరోపణలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.
READ ALSO: Hero Vijay Meet KCR: కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ.. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నారా?
READ ALSO: MLC Kavitha: జాతీయ పార్టీ కాదు.. తోక పార్టీ! రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook