Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం
తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది. జడ్జిలుగా నియమితులైన వారిలో పి.శ్రీసుధ, సి.సుమలత, డాక్టర్ జి.రాధా రాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవి దేవి ఉన్నారు.
New judges appointed for telangana high court: తెలంగాణ హైకోర్టు(telangana high cour)tకు ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది కేంద్రం. సెప్టెంబరు 16న కొలీజియం పంపిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(President Ram Nath Kovind) ఆమోదం తెలపడంతో... కేంద్ర న్యాయశాఖ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్జిలుగా నియమితులైన వారిలో పి.శ్రీసుధ, సి.సుమలత, డాక్టర్ జి.రాధా రాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి.మాధవి దేవి ఉన్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం(supreme court collegium) తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఏడుగురు పేర్లను సెప్టెంబరు 16న సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ చొరవ చూపి గత జూన్‌లో కోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడున్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియామకాలకు సిఫార్సు చేశారు. కొత్తగా ఏడుగురు జడ్జిల నియామకానికి కేంద్ర ప్రభుత్వం(Govt Of India) ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరిగింది.
Also read: TRS state president elections : ఈ నెల 25న టీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక
హైకోర్టుల్లో న్యాయమూర్తుల(High Court Judges)ను నియమించడానికి ఆగస్టు 25, సెప్టెంబర్ 1న కొలీజియం సభ్యులు సమావేశమై 112 మంది పేర్లను పరిశీలించారు. ఇందులో నుంచి 68 మందిని ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేశారు. 68 మందిలో 44 మంది బార్ సభ్యులను ఎంపిక చేసుకోగా.. మిగతావారు జ్యుడిషియల్ అధికారులు. న్యాయశాఖ ప్రకారం, ఈ నెల 1వ తేదీనాటికి మొత్తం 25 హైకోర్టుల్లో 465 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 68 ఖాళీలున్నాయి. పంజాబ్, హర్యానాలో 40, కలకత్తాలో 36 ఖాళీలున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook