TRS state president elections : ఈ నెల 25న టీఆర్‌‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక

TRS state president elections to be held on Oct 25: డేళ్లకోసారి టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరణ చేపడతామన్నారు. 23న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 04:06 PM IST
  • ఈ నెల 25న టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
  • ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 25న టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక
  • నవంబర్‌ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన
TRS state president elections : ఈ నెల 25న టీఆర్‌‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక

TRS working president and Telangana IT minister KTR says TRS state president elections to be held on Oct 25: ఈ నెల 25న టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. రెండేళ్లకోసారి టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. తాజాగా తెలంగాణ భవన్‌లో (telangana bhavan) ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు (nominations) స్వీకరణ చేపడతామన్నారు. 23న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఇక ఈ నెల 25న టీఆర్ఎస్ (TRS) అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్పారు. 

ఇక నవంబర్‌ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన (telangana vijaya garjana) పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ నెల 27న తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు సంబంధించిన సన్నాహక సభలు నిర్వహిస్తామన్నారు. లక్షలాది మంది కార్యకర్తలతో ఈ ‘తెలంగాణ విజయ గర్జన సభ’ నిర్వహిస్తామని చెప్పారు.

Also Read : NEET cancellation: నీట్‌ రద్దు విషయంలో కేటీఆర్‌తో డీఎంకే ఎంపీల భేటీ

టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణ పనులు పూర్తయ్యాయని కేటీఆర్‌ (KTR) పేర్కొన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇక అక్టోబర్‌ 17న టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని చెప్పారు. దేశంలో తెలంగాణ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు.

 

Also Read : Gambhir Comments on Kohli: 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే': గంభీర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News