హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది. నవంబర్ 1 , 2019 నుంచి అక్టోబర్ 30, 2021 వరకు ఈ విధానం అమల్లో  ఉంటుంది. కొత్త పాలసీని అనుసరించి మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షలు చేశారు. రాష్ట్రంలో 2 వేల 216 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా దుకాణాదారుల ఎంపిక జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. 


ఇదిలా ఉంటే జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులు ఖరారు చేశారు. గతంలో ఉన్న 4 స్లాబులను కాస్త 6 స్లాబులుగా మార్పులు చేశారు. కొత్త మద్యం పాలసీని అనుసరించి  లైసెన్స్ ఫీజులు ఇలా ఉన్నాయి.


* 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు, 
* 5వేల వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ. 55 లక్షలు
* 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు 
‘ లక్ష జనాభ నుంచి 5 లక్షల పలోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు
 5 లక్ష నుంచి 20 లక్షల లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు
 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు 


తాజాగా నిర్ణారించిన లైసెన్సు ఫీజులను గమనిస్తే గతంలో కంటే మద్యం ధరలు మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.