రెవెన్యూ విధానంలో సంస్కరణలకు తెరతీసిన తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇటీవల వీఆరోఓ వ్యవస్ధను రద్దు చేసింది. దీని స్థానంలో నూతన రెవెన్యూ చట్టం (New Revenue Act Telangana) తీసుకొచ్చింది. అసెంబ్లీ సమావేశాలలో నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం ముద్ర పొందిన రెవెన్యూ చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. IBPS PO Admit Card 2020: ఐబీపీఎస్ పీఓ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెవెన్యూ చట్టంతో పాటు ఇటీవల అసెంబ్లీ సమావేశాలో ఆమోదం పొందిన మొత్తం 12 చట్టాలపై గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి భూ హక్కులు పాసు పుస్తకాలు, వీఆర్ఓల రద్దు, టీఎస్ బీపాస్, పంచాయతీ రాజ్, ప్రైవేట్ వర్సిటీలు, పురపాలక, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు, తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు, తెలంగాణ న్యాయస్థానాల రుసుము, తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లుతో పాటు జీఎస్టీ సవరణ చట్టాల అమలుకు తెలంగాణ ప్రభుత్వ గెజిట్ జారీ చేయగా.. ఈ బిల్లును అధికారికంగా అమలులోకి రానున్నాయి. GHMC Elections: నోడల్ అధికారుల నియామకం 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe