Telangana: రాష్ట్ర పోలీస్ శాఖలో కొత్తగా 11 మంది ఐపీఎస్లు
నవ తెలంగాణలో యువ ఐపీఎస్ రక్తం వచ్చి చేరింది. శిక్షణ పూర్తి చేసుకున్న 11 మంది ఐపీఎస్ లకు తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్ లభించింది. గ్రేహౌండ్స్ శాఖలో కొత్త ఐపీఎస్ లు విధులు నిర్వహించబోతున్నారు.
నవ తెలంగాణ ( Telangana ) లో యువ ఐపీఎస్ ( IPS ) రక్తం వచ్చి చేరింది. శిక్షణ పూర్తి చేసుకున్న 11 మంది ఐపీఎస్ లకు తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్ లభించింది. గ్రేహౌండ్స్ శాఖ ( Greyhounds department ) లో కొత్త ఐపీఎస్ లు విధులు నిర్వహించబోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ( Telangana state police ) లో కొత్తగా 11 మంది ఐపీఎస్ అధికారులు వచ్చి చేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రం ( ఎన్ పీ ఏ ) లో మొత్తం 131 మంది ఐపీఎస్ లు సెప్టెంబర్ 3వ తేదీన శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 11 మందిని కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. ఈ నేపధ్యంలో 2017, 2018 బ్యాచ్ లకు చెందిన 11 మంది ఐపీఎస్ లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగులిచ్చింది. వీరందరికీ రాష్ట్రంలోని గ్రేహౌండ్స్ శాఖలో అసాల్ట్ కమాండర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా చేరిన ఐపీఎస్ అధికార్లు వీరే
1. అఖిల్ మహాజన్ ( 2017 )
2. ఖారే కిరణ్ ప్రభాకర్ ( 2017 )
3. చెన్నూరి రూపేష్ ( 2017 )
4. నితిక పంత్ ( 2017 )
5. యోగేశ్ గౌతం ( 2018 )
6. స్నేహా మెహ్రా ( 2018 )
7. హర్షవర్ధన్ ( 2018 )
8. గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ( 2018 )
9. రితిరాజ్ ( 2018 )
10. బిరుదరాజు రోహిత్ రాజు ( 2018 )
11. బి బాలస్వామి ( 2018 )