Niharika Konidela, Rahul Sipligunj and other tollywood celebrities caught in Rave party in Banjara Hills Pub: హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో పలు రకాల డ్రగ్స్‌ బయటపడ్డాయి. పబ్‌లో నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీని ఆదివారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో నార్త్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భగ్నం చేశారు. సమయానికి మించి పబ్‌ను రన్ చేస్తుండడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌ యజమానులు సహా సుమారు 157 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అందులోకి తీసుకున్న 157 మందిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్‌ సిబ్బంది ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో గాయకుడు, బిగ్‌బాస్‌ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌.. మెగా డాటర్ నిహారిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులో ఉన్న యువతీ యువకుల నుంచి వివరాలను సేకరించిన అనంతరం వారిని పోలీసులు ఇంటికి పంపించేశారు. నిహారిక, రాహుల్‌ సిప్లిగంజ్‌కు కూడా నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారని సమాచారం. ఎంపీ, మాజీ ఎంపీ పిల్లలు కూడా ఇందులో ఉన్నారట.

పోలీసుల తనిఖీల్లో కొన్ని రకాల డ్రగ్స్‌తో పాటు కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ సిగరెట్లు, గంజాయి లభ్యమయ్యాయి. పబ్‌లో అప్పటికే 40 గ్రాముల కొకైన్‌ వాడేయగా, 12 గ్రాములు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారని కూడా తెలుస్తోంది. బయట పడేసిన మత్తు పదార్థాలను కూడూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. పబ్‌లో పార్టీ జరుగుతున్నప్పటికీ వీడియోలు, ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై గతంలోనే ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పబ్‌ ఓ మాజీ ఎంపీ కుమార్తెదని, అందుకే వేకువజామున 3 గంటల వరకు తెరిచి ఉన్నా బంజారాహిల్స్‌ పోలీసులు పట్టించుకోలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. పబ్‌ యాజమాన్యమే డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


Also Read: Malaika Arora Accident: బాలీవుడ్ నటి మలైకా అరోరా కారుకు ప్రమాదం.. గాయాలతో ఆస్పత్రిలో చేరిక!


Also Read: Viral Video: నడిరోడ్డులో యువతిని కొట్టుకుంటూ వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్.. వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook