Viral Video: నడిరోడ్డులో యువతిని కొట్టుకుంటూ వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్.. వీడియో వైరల్!

Viral Video: ఓ ప్రేమ జంట మధ్య జరిగిన గొడవను ఆపేందుకు మధ్యలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్లాడు. అంతలో ఆ ప్రేమికురాలు ఫుడ్ డెలివరీ బాయ్ ను దూషించగా.. కోపం పట్టలేదని ఆ వ్యక్తి నడిరోడ్డులో ఆమెను కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 11:48 AM IST
Viral Video: నడిరోడ్డులో యువతిని కొట్టుకుంటూ వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్.. వీడియో వైరల్!

Viral Video: ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ఇందిరా గాంధీ పార్క్ వద్ద ఓ ప్రేమ జంట మధ్య గొడవ జరిగింది. పార్క్ బయట ఇద్దరు ప్రేమికులు గొడవపడ్డారు. తన ప్రేమికుడ్ని తిడుతూ.. ఆ యువతి రోడ్డుపై హల్ చేసింది. అసభ్యకరంగా తిడుతూ రెచ్చిపోయింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ పై ఆమె రాళ్లు కూడా విసిరింది. అయితే అందుకు సంబంధించిన వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ, ఇప్పుడు అదే యువతిని ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ నడిరోడ్డులో దారుణంగా కొట్టాడు. అయితే అందుకు కారణం మాత్రం లేకపోలేదు. ఇంతకీ దాని వెనుకున్న కారణమేంటో మీరే చూసేయండి. 

ఏం జరిగిందంటే?

ఓ ప్రేమ జంట పార్క్ బయట గొడవపడ్డారు. తాను ప్రేమించిన వ్యక్తిపైకి నడిరోడ్డులో ఆ యువతి రాళ్లు కూడా విసిరింది. ఇంతలో చుట్టుపక్కలవారు గుమిగూడి ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన ప్రియురాలు అక్కడే ఉన్న ఒకరి మొబైల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది. అలాగే ఫైటింగ్ సరదాగా చూసేందుకు పలువురు అక్కడికి వెళ్లారు.

ఈ క్రమంలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఆ గొడవను ఆపేందుకు ముందుకు వచ్చాడు. ఆ పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ బాయ్ తో ఆ యువతికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతలో ఆ యువతి ఫుడ్ డెలివరీ బాయ్ పై బూతుపురాణం మొదలెట్టింది. 

చివరకు సహనం కోల్పోయిన ఫుడ్ డెలివరీ బాయ్ మహిళపై వాగ్వివాదానికి దిగాడు. నాలుగైదు సార్లు ఆమె చెంప చెళ్లుమనిపించాడు. ఈ గొడవను సర్దుమణిచేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించడం మనం వీడియోలో చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్లిక్ ప్లేస్ లో ఈ గొడవ పడిన కారణంగా ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Also Read: Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని జంతువులున్నాయో చెప్తే.. మీరు నిజంగా మేధావే!

Also Read: King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News