Nizamabad MP Dharmapuri Arvind Sensational comments on telangana government and vemulawada by election: తెలంగాణలో మరో ఉపఎన్నిక అంటూ నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందన్నారు ధర్మపురి అర్వింద్‌ ( MP Dharmapuri Arvind ). మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తక్కువ ధాన్యం కొనుగోలు చేసి రిజిస్ట్రర్లలో ఎక్కువ సేకరించినట్టు నమోదు చేసేవారన్నారు. అయితే దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సేకరణ ప్రక్రియను కంప్యూటరీకరణ చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో దళారుల అక్రమాల దర్యాప్తుపై ఎఫ్‌సీఐ నిర్ణయిస్తుందని తెలిపారు. ఇక త్వరలో వేములవాడ ఉప ఎన్నిక (vemulawada by election) రావొచ్చన్నారు. అక్కడ కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Flash News:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కుటుంబంలో మరో విషాదం..మరణించిన 7గురు సన్నిహితులు


అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ వైఫల్యంతో తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కేవలం వరి పంట వేయాలని రైతులను కోరారని, మార్క్‌ఫెడ్ సంస్థను నిర్వీర్యం చేశారన్నారు. మొక్కజొన్న కొనుగోలు మార్క్ ఫెడ్ (Mark Fed) సంస్థ కాకుండా.. దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులు కల్పించారని విమర్శించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను (TRS‌) బీజేపీ ఓడించలేదని, ప్రజలే ఓడించారన్నారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన ముఖ్యమంత్రి ధర్నాలు చేయడం కేసీఆర్ చేతకాని తనం అని మండిపడ్డారు. అన్ని రకాల ఖర్చులు ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇచ్చి ధాన్యం సేకరణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government) ఆ బాధ్యతలు నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు.


Also Read : Metal Astrology: రంగు రాళ్లే కాదు.. ఈ రాశివారికి లోహాలు కూడా మంచి ఫలితాలిస్తాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook