Flash News: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కుటుంబంలో మరో విషాదం.. మరణించిన 7గురు సన్నిహితులు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ బంధువులు ఏడుగురు చనిపోయారు...      

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 06:27 PM IST
  • చిన్న వయసులోనే మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌
  • సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కుటుంబంలో మరో విషాదం
  • రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సన్నిహితులు మరణం
Flash News: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కుటుంబంలో మరో విషాదం.. మరణించిన 7గురు సన్నిహితులు

 Sushant Singh Rajput's Family Died in Road Accident: హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు మరో చేదువార్త. రోడ్డు ప్రమాదంలో దివంగత నటుడి కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ వార్తతో సుశాంత్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. బీహార్‌ (Bihar) లోని లఖిసరాయ్‌లో (Lakhisarai) మంగళవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది, ఇందులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. ఈ ఏడుగురిలో ఐదుగురు సుశాంత్‌ కుటుంబానికి చెందినవారే.

మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదం

బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో (Lakhisarai District) మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో ఐదుగురు ఫిల్మ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) బంధువులు. వీరితో పాటు కారు డ్రైవర్ కూడా చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వాహనం జాతీయ రహదారి నంబర్ 333 గుండా వెళుతుండగా, ట్రక్కును డీ కొట్టడంతో.. అందులో ఉన్న ఏడుగురు చనిపోయారు.

Also Read: Metal Astrology: రంగు రాళ్లే కాదు.. ఈ రాశివారికి లోహాలు కూడా మంచి ఫలితాలిస్తాయి

సుశాంత్ బావ తన సోదరి అంత్యక్రియల నుండి తిరిగి వస్తుండగా.. 

హర్యానా (Haryna) సీనియర్ పోలీసు అధికారి OP సింగ్ (Police Officer OP Singh, ).. చనిపోయిన బాలీవుడ్ (Bollywood) హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బావ.. OP సింగ్ సోదరి గీతా దేవి (Geeta Devi) అంత్యక్రియలకు వెళ్లి పాట్నా (Patna) నుండి తిరిగి వస్తుండగా.. ప్రమాదం జరిగింది. 

చిన్న వయసులోనే మరణించిన సుశాంత్ 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా చాలా చిన్న వయస్సులోనే చనిపోయిన సంగతి మనకు తెలిసిందే.. సుశాంత్ 14 జూన్ 2020న ముంబైలోని (Mumbai) తన ఇంట్లో శవమై కనిపించాడు. అయితే సుశాంత్ మరణం ఆత్మహత్యా లేక హత్యా అనే మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే సుశాంత్ మరణానికి బాలీవుడ్ (Bollywood) లో కొనసాగుతున్న బంధుప్రీతి (Nepotism) అని కొంత మంది చర్చించుకుంటున్నారు. 

Also Read: Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News