అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాకు మోదీ ఇచ్చిన విందుపై నిజాం మనవడు నజాఫ్ అలీ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని ఇచ్చిన విందుకు తనను, తన కుటుంబాన్ని ఆహ్వానించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది రోజులుగా అధికారులు విందు విషయంలో తన సలహాలు తీసుకున్నారని..తమ సంస్కృతి, సంప్రదాయానికి అనుగుణంగా విందు కార్యక్రమం జరిగిందని పేర్కొంటూ..ఈ విందుకు తమ కుటుంబాన్ని ఆహ్వానించకపోవడం దారుణమని విమర్శించారు. ఇది నిజాం కుటుంబాన్ని అవమానించడమేని వెల్లడించారు. ఫలనుమా ప్యాలెస్ నిజాం సంస్కృతికి గుర్తింపు సూచకమని ..అలాంటి చోట జరిగిన విందుకు తమను ఆహ్వానించకపోవడం దారుణమని విమర్శించారు.


ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్లొనేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు, అధికారులు, విదేశీ ప్రతినిధులకు ప్రధాని మోదీ హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలస్ లో నిన్న రాత్రి విందు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంతో నజాఫ్ అలీఖాన్ ఇలా వాపోయారు.