Covid-19: వారికోసం ప్రత్యేక బృందాలు.. కేటీఆర్
కరోనాపై పోరులో ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని, ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారని, తెలంగాణలో వలస కూలీలు తొమ్మిది లక్షలకు పైగా ఉంటారని, వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని, హైదరాబాద్‌లో 170 శిబిరాలు
హైదరాబాద్: కరోనాపై పోరులో ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని, ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారని, తెలంగాణలో వలస కూలీలు తొమ్మిది లక్షలకు పైగా ఉంటారని, వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని, హైదరాబాద్‌లో 170 శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించామని రాష్ట్రంలో ఏ మూలనా ఉన్నా వెతికి ఆసుపత్రులలో చేర్పించడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని అన్నారు.
Also Read: 3.2 లక్షల మంది కరోనా రోగుల కోసం 20,000 బోగీలతో ఐసోలేషన్ వార్డులు
మరోవైపు ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని తబ్లిఘి జమాత్ ప్రార్ధనలో పాల్గొన్న 1,800 మందిలో సగానికి పైగా ప్రజలు రెండు రాష్ట్రాల నుండి వచ్చారని తమిళనాడు అస్సాం అధికారులు తెలిపారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని జమాత్ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం దేశంలో అతిపెద్ద వ్యాప్తి కేంద్రంగా నిలిచింది. 24 మందికి పరీక్షలు చేయగా, ఇంకా దాదాపు 200 మందికి ఈ లక్షణాలుండొచ్చని అంచానా వేస్తున్నారు.
Read also : BCCI: ఐపీఎల్‌పై చిగురిస్తున్న ఆశలు
ఈ నెలలో మొదటివారంలో జరిగిన ప్రార్థనల్లో హాజరైన వారి సంఖ్యను చూస్తే తమిళనాడు నుండి 510 మంది, అస్సాం 281, ఉత్తర ప్రదేశ్ 156, మహారాష్ట్ర 109, మధ్యప్రదేశ్ 107, బీహార్ 86 మంది వచ్చారని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ 73, తెలంగాణ 55, జార్ఖండ్ 45, కర్ణాటక 45, ఉత్తరాఖండ్ 34, హర్యానా 22, అండమాన్, నికోబార్ దీవుల 21, రాజస్థాన్ 19, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా 15, పంజాబ్ 09, మేఘాలయ నుండి 5గురు హాజరయ్యారని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..