BRS Party Diary: ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గొద్దని.. రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తున్న తీరుపైన ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తనపై నమోదవుతున్న అక్రమ కేసులపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఒక లొట్టపీసు కేసు అంటూనే రేవంత్‌ రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BRS Party: 'ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ మల్లెపువ్వు లాగా బయటకు వస్తాడు'


డైరీ ఆవిష్కరణ
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ డైరీ ఆవిష్కరించారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి డైరీని ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. 'పార్టీ పెట్టినప్పుడున్న ఉన్న పరిస్ధితి.. తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు.. అమరవీరులు చేసిన త్యాగాలతో పొల్చితే ఇప్పుడున్న పరిస్ధితి ఇబ్బందేం కాదు' అని తెలిపారు. ఇప్పుడున్న కేసు లొట్టపీసు… రేవంత్ రెడ్డి ఒక్క లొట్టపీసు ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు.

Also Read: KT Rama Rao: నాకు ఉరిశిక్ష పడ్డట్టు కాంగ్రెసోళ్ల సంబరాలు ఎందుకు? నేను అవినీతి చేయలేదు


'చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని.. కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని ఈ అక్రమ కేసుకు భయపడుతామా' అని కేటీఆర్‌ ప్రకటించారు. జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై కేంద్రం కక్షకడితే ప్రజల కోసం.. రాష్ట్రం కోసం పోరాటం చేసి శిబు సోరెన్ కొడుకు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు అని కేటీఆర్‌ గుర్తుచేశారు. లగచర్ల రైతులు తమ భూమి గుంజుకోవద్దనందుకు 40 రోజులు జైల్లో అక్రమంగా పెట్టిన దానితో పొల్చితే మనకున్న పరిస్ధితి ఏం ఇబ్బంది అని ప్రశ్నించారు.

చట్టప్రకారం కొట్లాడుతా
రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఇచ్చిన కాంగ్రెస్ హమీలను ప్రశ్నించాలని సూచించారు. రైతులు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీల అమలు.. ప్రభుత్వ మోసంపై మాట్లాడుదామని చెప్పారు. 'నాపై పెట్టిన అక్రమ కేసు గురించి అలోచించాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ కేసుపైన నేను చట్టప్రకారం కొట్లాడుతా' అని స్పష్టం చేశారు.

ఒక్కొక్క కార్యకర్త ఒక్కో కేసీఆర్‌లా
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడేది లేదని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలే అన్నీ అని వివరించారు. ఈ అక్రమ కేసుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 'తెలంగాణ కోసం మనం కలిసి నడుద్దాం. ఈ సంవత్సరాన్ని మొత్తంగా పోరాట నామ సంవత్సరంగా ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. ఒక్కొక్క పార్టీ కార్యకర్త ఒక్కో కేసీఆర్‌గా మారి పోరాటం చేయాలి' అని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.