Telangana Fluoride Problem: ఫ్లోరైడ్‌పై తెలంగాణ విజయం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఎట్టకేలకు ఫ్లోరైడ్‌పై విజయం (Fluoride Problem In Telangana) సాధించిందని, దాని ప్రభావిత ప్రాంతాలు లేనే లేవని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్లే ఫ్లోరోసిస్‌పై విజయం సాధించగలిగాం అన్నారు.
తెలంగాణలో అతి ముఖ్యమైన సమస్యలలో ఫ్లోరోసిస్ ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఎట్టకేలకు ఫ్లోరైడ్‌పై విజయం సాధించిందని, దాని ప్రభావిత ప్రాంతాలు లేనే లేవని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారని తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్లే ఫ్లోరోసిస్‌పై విజయం సాధించగలిగాం అన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ టీమ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!
2015 సమయంలో నేడు ఫ్లోరైడ్ బాధిత గ్రామాల వివరాల పట్టికను షేర్ చేశారు. 967 గ్రామాలు ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ సమస్యను ఎదుర్కొన్నాయని... అయితే మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయడం ద్వారా విజయం సాధించామన్నారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు లేనేలేవని స్పష్టం చేశారు. ఏపీలో 2015 నాటికి 402 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుండగా.. ప్రస్తుతం 111 గ్రామాల్లో సమస్య ఉంది. Telangana: కొత్తగా 2043 కరోనా కేసులు
తెలంగాణలో అధికంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య ఉంది. దీని కారణంగా కాళ్లు, చేతులు వంకరపోవడం, ఎత్తు పెరగకపోవడం, తదితర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా ఒక లీటర్ తాగునీటిలో 1 పీపీఎం కంటే ఎక్కువ మోతాదులో ఫ్లోరైడ్ ఉండే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నల్గొండలోని కొన్ని మండలాల్లో పీపీఎం మోతాదు 6శాతం వరకు ఉండేది. దీంతో అక్కడి ప్రజలు నిత్యం ఫ్లోరోసిస్‌తో బాధపడేవారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత నీటిని అందజేసి ఫ్లోరైడ్ సమస్యపై విజయం సాధించారు. Telangana Rains: మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
అత్యధికంగా రాజస్థాన్‌లో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంది. 2015లో 7056 ప్రభావిత గ్రామాలుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 3095కి దిగొచ్చింది. అసోం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఫ్లోరైడ్‌తో పాటు ఆర్సెనిక్ ప్రభావిత గ్రామాలున్నాయి.
ఫొటో గ్యాలరీలు
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR