'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా  ఇప్పటికే లాక్ డౌన్ 4.0 అమలులోకి వచ్చింది. తెలంగాణలో లాక్ డౌన్ మే 31వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే ఇప్పుడు లాక్ డౌన్ ఆంక్షలను మరింతగా  సడలించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. దీంతో ఇవాళ్టి (మంగళవారం) నుంచే బస్సులు రోడ్డెక్కాయి. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో దాదాపు 2 నెలలుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో బస్సులను తిరిగి నడిపించేందుకు నిన్నఅర్ధరాత్రి నుంచే కార్మికులు సన్నాహాలు చేశారు. బస్సులన్నింటినీ శానిటైజ్ చేశారు. 


అలాగే ప్రయాణీకులు  సామాజిక దూరం పాటించేలా ఆర్టీసీ సిబ్బంది  చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాదు బస్సుల్లో పరిమిత సంఖ్యలోనే ప్రయాణీకులను అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కేవలం జిల్లాల మధ్య మాత్రమే తిరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులను అనుమతి లేదు.  


మరోవైపు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగలేదు. నిన్న మీడియాతో మాట్లాడిన సమయంలో ఆర్టీసీ బస్సులు నేటి( మంగళవారం) నుంచి తిరుగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఐతే ఇన్నాళ్లూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు మళ్లీ ఛార్జీలు వడ్డిస్తారేమోనని అంతా భావించారు. కానీ ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆర్టీసీ ఛార్జీలు పెంపు ఇప్పట్లో ఉండే అవకాశం లేదంటున్నారు నిపుణులు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..