Mobile Network Collapse: కుండపోత వర్షాలతో తెలంగాణ మొత్తం జలదిగ్బంధమైంది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుట్టు ముట్టిన వరదకు తోడు గాలివాన తోడవడంతో చెట్లు కూలుతున్నాయి. అంతేకాకుండా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నాయి. తాజాగా మొబైల్‌ ఫోన్లు కూడా పని చేయడం లేదు. ముఖ్యంగా అటవీ జిల్లా మహబూబాబాద్‌ జిల్లాలో పరిస్థితి దయానీయంగా మారింది. ఇక్కడ కొన్ని గంటల పాటు మొబైల్‌ ఫోన్లు పని చేయక జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Heavy Rains: భారీ వర్షాలు.. అత్యవసరమైతే చేయాల్సిన ఫోన్‌ నంబర్లు ఇవే!


 


మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం మొబైల్ ఫోన్‌లు పని చేయలేదు. వర్షాలతో అన్ని నెట్‌వర్క్‌లు స్తంభించాయి. ఉదయం నుంచి సిగ్నల్స్ సమస్య తలెత్తింది. దీంతో ఫోన్లు రావడం.. వెళ్లడం అనేది కుదరలేదు. తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు వర్షాకాలంలో ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం రాలేదు.

Also Read: High Alert: పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం


 


మానుకోట జిల్లాలో అన్ని నెట్వర్క్ పరిస్థితి ఇలానే ఉంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నెట్‌వర్క్‌ వ్యవస్థ కుప్పకూలిపోయింది. కనీస సమాచారం పంపించేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమస్యను త్వరగా పరిష్కరించాలని మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు నెట్‌వర్క్‌ సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. టోల్‌ఫ్రీకి సమస్యలు పోటెత్తాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter