దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే భారత్‌లో 1,31,968 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 780 కోవిడ్19 మరణాలు సంభవించాయి. ఇటీవల ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా టీకా ఉత్సవ్(COVID-19 Vaccine Drive) నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పిలుపునిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వ్యాక్సిన్ మోతాదులు లేకుండా టీకా ఉత్సవ్ ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షాలు విమర్శలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మీడియాతో శుక్రవారం మాట్లాడారు. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కోవిడ్19 నిబంధనలు పాటించకపోతే కరోనా కేసులు పెరుగుతాయని, వైరస్‌ను కట్టడి చేయడం కష్టతరంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు అందించేందుకు తగినన్ని కోవిడ్19(COVID-19) టీకాలు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని మోతాదులు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.


Also Read: COVID-19 Positive Cases: తెలంగాణలో తాజాగా 2500 చేరువలో పాజిటివ్ కేసులు


హైదరాబాద్‌లో గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గాంధీలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు, చికిత్స కేంద్రాలను పరిశీలించారు. వైద్యులను అడిగి ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ మరో 58 దేశాలకు కరోనా వ్యాక్సిన్ మోతాదులు సరఫరా చేసిందని, దేశంలో కోవిడ్19 వ్యాక్సిన్ మోతాదులకు ఎలాంటి కొరత లేదన్నారు. సీరం, భారత్ బయోటెక్ సంస్థలు తక్కువ సమయంలో భారీ కరోనా టీకా మోతాదులను ఉత్పత్తి చేస్తున్నాయని కిషన్‌రెడ్డి(Kishan Reddy) కొనియాడారు. కరోనా టీకాలు తీసుకున్న వారు ఇతరులకు అవగాహనా కల్పించాలన్నారు.


Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి


దేశంలో కరోనా టీకాల కొరత లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భారీగా టీకాలు ఉత్పత్తి జరుగుతుందని, దీనిపై ఏ ఆందోళన అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కోవాగ్జిన్ టీకా తీసుకోగా, తాను కోవిషీల్డ్ టీకా తీసుకున్నానని తెలిపారు. ప్రపంచ దేశాలకు టీకాలను అందిస్తున్న భారత్‌లో వ్యాక్సిన్లకు కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook