No Water Supply in Hyderabad: తాగునీటి పనుల నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్‌ కానుంది. ఈనెల 9, 10 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఏ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదో వివరంగా తెలుసుకుందాం.మార్చి 9 మాత్రమే కాదు 10న కూడా తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. మార్చి 10వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తాత్కాలికంగా నీటి సరఫరా నిలిచిపోనుంది. ఉస్మాన్ సాగర్ నుంచి హకీంపేట వరకు నీటి పైప్ లైన్ల మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజీ బోర్డు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాంతాలవారీగా వివరాలు ఇలా ఉన్నాయి..
విజయనగర్ కాలనీ, హుమాయున్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, బజార్ ఘాట్, ఏసీ గార్డ్స్‌, రెడ్ హిల్స్, ఇన్‌కాం ట్యాక్స్ ఏరియా, సెక్రటేరియట్ చుట్టు పక్కన ఉండే ప్రాంతాలు, ఇందిరా నగర్, బీజేఆర్ కాలనీ, అడ్వకేట్ కాలనీ, హిల్స్ కాలనీల్లో తాగునీటి సరఫరా ఉండదు.


ఇదీ చదవండి: మొదట ఇల్లు కట్టుకునేవారికే రూ. 5 లక్షలు.. ప్రభుత్వం కీలక అప్డేట్..


అలాగే, నాంపల్లి రైల్వేస్టేషన్ చుట్టు పక్క ప్రాంతాలైన గోకుల్ నగర్, జనగాం బస్తీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లకిడికాపూల్,సీతారాం బాగ్, చిరాగ్ అలి లేన్, న్యూ ఎంఎల్‌ఏ క్వార్టర్స్, బీఆర్కే భవన్, హింది నగర్, ఘోడే ఖబర్, దోమల్‌ గూడ, గాంధీనగర్, ఎంఎల్‌ఏ కాలనీ, సయ్యద్ నగర్, తట్టిఖానాలోని పలు ప్రాంతాలు, ఎన్‌బీటీ, నూర్ నగర్ లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది.


ఇదీ చదవండి: తెలంగాణలో రేపటి నుంచి వరుసగా 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు..


ఈ ఏడాదిలోనే పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఇలాగే అంతరాయం ఏర్పడింది. వర్షభావం వల్లే ఇలా తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. తాగునీటి రిజర్వయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయి అందుకే ఈ పరిస్థతి ఏర్పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు. బుధవారం రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter