Indiramma Housing Scheme: మొదట ఇల్లు కట్టుకునేవారికే రూ. 5 లక్షలు.. ప్రభుత్వం కీలక అప్డేట్..

Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట. 

Written by - Renuka Godugu | Last Updated : Mar 12, 2024, 12:13 PM IST
Indiramma Housing Scheme: మొదట ఇల్లు కట్టుకునేవారికే రూ. 5 లక్షలు.. ప్రభుత్వం కీలక అప్డేట్..

Indiramma Housing Scheme in Telangana: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సొంత జాగా ఉన్న పేదాలకు రూ.5 లక్షలు కేటాయించనుంది. అమరులకు 250 గజాల స్థలాన్ని కూడా కేటాయించనుందట.ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

అయితే, తొలిదశలో సొంత ఇల్లు ఉన్నవారికే రూ.5 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ సంవత్సరం దాదాపు 4.5 లక్షల ఇల్లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి  3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ తొలి ప్రాధాన్యమివ్వాలని సీఎం చెప్పారు. గత బీఆర్ఎస్‌ పార్టీ ప్రభుత్వం డబుల్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని తెలిపారు. దశల వారీగా పేదల సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ సంకల్పమని వివరించారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో రేపటి నుంచి వరుసగా 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు..

అర్హులు..
1. దరఖాస్తుదారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
2. వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఒక్కో ఇంటికి ఒక్కరినే అర్హులుగా ఎంపిక చేస్తారు.

ఇదీ చదవండి: తెలంగాణపై సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ, దౌర్భాగ్యం: కేటీఆర్‌

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News