తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ రోజు 10 మంది అభ్యర్ధులను..సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. గతంలో సీఎం కేసీఆర్ తో కలిసి డిప్యూటీ సీఎంగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేత గవర్నర్ నరసింహన్ ప్రయాణ స్వీకారంచేయించిన విషయం తెలిసిందే. తాజా విస్తరణతో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12కి చేరింది. అయితే ఇందులో ఒక్కరు కూడా మహిళా మంత్రులు లేకపోవడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలోనూ కేసీఆర్ తన కేబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వలేదు..దీంతో మహిళా వ్యతిరేకి అనే కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తాజా మంత్రివర్గంలోనూ మహిళలకు చోటు కల్పించకపోవడం గమనార్హం.  మహిళలకు మొండిచేయి చూపిన ఈ పరిణామం విమర్శలకు దారి తీస్తోంది.


ప్రస్తుతానికి బుల్లి కెబినెట్ తో ప్రభుత్వ బండిని లాగేందుకు మొగ్గుచూపిన కేసీఆర్.. లోక్ సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గ విర్తరణ నిర్వహిస్తారని టాక్.. మరోసారి జరిగే విస్తరణలో మరో ఆగురురికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. రెండో సారి జరిగే విస్తరణలో మహిళలకు స్థానం కల్పిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.