COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NTR Birth Anniversary: ఈ రోజు అన్న ఎన్టీఆర్ 101వ జయంతి.. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అన్న గారికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతాకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్  విషయానికొస్తే.. తెలుగు సినిమా పరిశ్రమలో  నంబర్ వన్ హీరోకు ఒక వెలుగు వెలిగారు.  అంతేకాదు హీరోగా దాదాపు 310 చిత్రాల్లో టైటిల్ పోషించి సంచలనం సృష్టించారు.అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో జానపద,పౌరాణిక,చారిత్రక, క సినీ కథానాయకుడిగా తెలుగు పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు.ఇక 57యేళ్ల వయసులో 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే కాంగ్రస్ పార్టీని మట్టి కరిపించి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి సంచలనం సృష్టించారు. అప్పటి వరకు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీని షేక్ చేశారు.  






అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరసగా 1983, 1984, 1985 సంవత్సరాల్లో సీఎంగా  మూడుసార్లు ప్రమాన స్వీకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు క్రియేట్ చేసారు.  13 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా తనదైన పాతని పోషించారు.1995లో పదవిచ్చుడైన ఎన్టీఆర్ 1996 జనవరి 18న తుది శ్వాస వీడిచారు


ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. అందులో మొదటి భాగం ఈ యేడాది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ మూవీని యువసుధ ఆర్ఠ్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నరు. ప్రస్తుతం వార్ 2 మూవీతో బిజీగా ఉన్నతారక్.. ఆ తర్వాత ప్యాన్  ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న  ప్రశాంత్ నీల్‌ సినిమా చేయనున్నాడు.


Also read: AP Elections Survey: ఏపీలో అధికారం ఎవరిది, జగన్‌కు క్లారిటీ వచ్చేసిందా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook