Obscene Dance in Pub: హైదరాబాద్ నగరం నడిబొడ్డున్న బేగంపేట్‌లో కంట్రీక్లబ్‌లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడున్న 33 మంది పురుషులతో పాటు అశ్లీల నృత్యాలు చేస్తున్న 9 మంది యువతులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పబ్ యజమానుల వేణు గోపాల్, సాయి భరద్వాజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు పబ్ మేనేజర్ రాము పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పబ్ కు వచ్చే యువకులను ఆకర్షించేందుకు కొంతమంది అమ్మాయిలతో నిర్వాహకులు డ్యాన్స్ చేయించేవారని విచారణలో తేలింది. అయితే ఆ యువతులందరూ షార్ట్ లెంగ్త్ డ్రసుల్లో ఉండే వారని.. వాటితో పాటు యువకుల రూమ్ లకు నిర్వాహకులు అమ్మాయిలను పంపేవారని పోలీసులు చెప్పారు. అలా డ్యాన్స్ చేసిన అమ్మాయిలకు రోజుకు రూ.1000 ఇచ్చినట్లు పేర్కొన్నారు.


అయితే గతంలోనూ ఇదే పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా.. అప్పుడూ కొంతమంది పట్టుబడ్డారు. అంతకు ముందు లిస్బన్‌ పబ్‌ నిర్వాహకులు నాలుగేళ్ల నుంచి అశ్లీల కార్యకలాపాలను నిర్వహిస్తున్నారంటూ పోలీసులు తెలిపారు.


పబ్ గురించి తమకు సమాచారం అందినప్పుడల్లా వెళ్లి యజమానులను అరెస్ట్‌ చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దాడులు నిర్వహించి లైసెన్స్‌ సీజ్‌ చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరగా.. కొద్దిరోజులు పబ్‌ను మూసేసిన వేణుగోపాల్‌ తర్వాత క్లబ్‌ టాలీవుడ్‌ పేరుతో పబ్‌ ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు.  


Also Read: Hyderabad: వ్యభిచారం చేయాలని 16 ఏళ్ల కూతురిపై తల్లి ఒత్తిడి-కేసు నమోదు చేసిన పోలీసులు


Also Read: Hyderabad: హైదరాబాద్ లో దారుణం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook