తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సం నేడు. సరిగ్గా ఇదేరోజు ఏప్రిల్ 27, 2001న ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ మరికొందరు నేతలతో కలిసి రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. నేడు పార్టీ అవతరణ దినోత్సవం సందర్భంగా నిరాడంబరంగా వేడుకలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 20ఏళ్ల అవుతున్న సందర్భంగా టీఆర్ఎస్ నేతలు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మీ కళ్లు అలా మారితే బీ కేర్‌ఫుల్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలను సైతం రక్తదానం చేయాల్సిందిగా కోరారు. తలసేమియా పేషెంట్లు, లేక ఇతర మెడికల్ అవసరాలకు రక్తం అవసరమవుతుందని పేర్కొన్నారు. స్థానిక ఆస్పత్రులకు వెళ్లి రక్తదానం చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు. తాను రక్తదానం చేసిన సందర్భంగా తీసిన ఫొటోలను షేర్ చేసుకున్నారు.  Photos: కబాలి బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు



ప్రతి ఏడాది హంగు ఆర్భాటాలతో నిర్వహించే టీఆర్ఎస్ అవతరణ దినోత్సవాన్ని ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా నిరాడంబరంగా జరుపుతున్నారు. అసలే దేశ వ్యాప్తంగా మే3 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండగా, తెలంగాణలో మే 7వరకు కొనసాగుతుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos